Yogi Adityanath: సోనియా, ప్రియాంకకి ఆహ్వానం, ఆ కార్యక్రమానికి యోగి ఆదిత్యనాథ్ ప్లాన్ మమూలుగా లేదు
యోగి ఆదిత్యనాథ్ ఆలోచనలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకే ఆయన ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకుండానే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో అద్భుతమైన విజయాన్ని సొంత చేసుకున్న యోగి ఆదిత్యనాథ్ ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లక్నోలోని ఎకనా మైదానంలో కార్యక్రమం జరగనుంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమినిస్టర్ అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డను యోగి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇందులో ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే... ప్రతిపక్షాలను కూడా యోగి తన ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి పిలవనున్నారు. కాంగ్రెస్ ప్రెసిడెండ్ సోనియా గాంధీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, సమాజ్‌వాది పార్టీ స్థాపించి ములాయం సింగ్ యాదవ్, సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, బహుజన సమాజ్‌వాద్ పార్టీ చీఫ్ మాయావతి ఈ ఆహ్వాన జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది.
వీళ్లందరితోపాటు ఆర్‌ఎస్‌ఎసస్ లీడర్లు, మరికొందరు కేంద్రమంత్రులు, ఇతర్రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రులు కూడా రానున్నట్టు తెలుస్తోంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులను ప్రమాణ స్వీకరణ సభకు తరలించాలని బీజేపీ భావిస్తోంది. ముఖ్యంగా మహిళా లబ్ధిదారులను ఎక్కువ రప్పించేలా ప్లాన్ చేస్తోంది.
యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేస్తే 37 ఏళ్ల తర్వాత యూపీ సీఎంగా ఐదేళ్లు పూర్తి చేసుకున్న తర్వాత పదవి చేపట్టే రెండో వ్యక్తి అవుతారు.