Father Son Viral Photo : తండ్రీకొడుకుల ఈ ఫోటో ఎందుకు హాట్ టాపిక్ అయిందో మీకు తెలుసా ?
రైల్వేలో పని చేస్తున్న తండ్రీ కొడుకుల సెల్ఫీ వైరల్ అయింది. ఎందుకంటే ?
Father Son Viral Photo : సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో ఫోటో వైరల్ అవుతుందో చెప్పలేం. ప్రస్తుతం ఓ తండ్రీ కొడుకుల సెల్ఫీ మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. సురేష్ కుమార్ అనే వ్యక్తి ట్వీటర్‌లో షేర్ చేసిన ఈ చిత్రంలో ఉన్న తండ్రి రైల్వేలో గార్డుగా పనిచేస్తుండగా.. కుమారుడు అదే రైల్వే శాఖలో ట్రావెల్ టికెట్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం సాధించాడు. తండ్రీకొడుకులు డ్యూటీలో ఉన్న సమయంలో ఒక రోజు అకస్మాత్తుగా ఎదురెదురు రైళ్లలో తారసపడ్డారు. ఆ క్షణంలో తీసుకున్న సెల్ఫీ ఫొటోనే ఇది. ఇందులో తండ్రీకొడుకులు ఇద్దరు కూడా తమ యూనిఫామ్ ధరించి ఉన్నారు.
अजब ग़ज़ब सेल्फ़ी
— Suresh Kumar (@Suresh__dhaka29) June 15, 2022
पिता रेलवे में गार्ड है और बेटा टीटी है । जब दोनो की ट्रेन अगल-बग़ल से गुजरी तो एक सेल्फ़ी का लम्हा बन गया ❤️ pic.twitter.com/Zd2lGHn7z3
ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. ఈ ఫోటో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘తండ్రీకొడుకులు ఉద్యోగాలు చేయడం సాధారణమే. కానీ ఒకే శాఖలో రెండు విభిన్న హోదాల్లో పనిచేయడం, వారు ఇలా తారస పడటం ఎంతో అద్భుతం’ అంటూ కాంమెంట్ చేస్తున్నారు. నెట్టింట్లో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే విపరీతంగా షేర్ అవుతోంది.
मुझे तो यह पोस्ट पसंद आई इसलिए मैंने शेयर की बाकी मैं व्यक्तिगत रूप से नहीं जानता
— Suresh Kumar (@Suresh__dhaka29) June 16, 2022
అయితే ఇది నిజం కాదని కొంత మంది వాదిస్తున్నారు. ఆ ఫోటో చుట్టూ కథ అల్లారని అంటన్నారు.
This is not the true story.. The selfie guy is TTE in Bangladesh Railway... Clearly written in his badge (zoom to it).. The other Guy is Guard of Maitree Express running btwn India and Bangladesh (see the train color).. Selfie taken in Bangladesh (track with three rails says it)
— Ankit Gupta ࿗ (@ankitgupta11jan) June 16, 2022
సోషల్ మీడియా అంటే అంతే నిజమో కాదో తెలుసుకోవడం కష్టం. కానీ బాగుందంటే అలా వైరల్ అయిపోతాయి.