సనాతన ధర్మాన్ని విమర్శించడం ఫ్యాషన్ అయిపోయింది, ఉదయనిధిపై కాంగ్రెస్ నేత ఫైర్
Sanatan Dharma Row: ఉదయనిధి స్టాలిన్‌పై కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ మండి పడ్డారు.

Sanatan Dharma Row:
వ్యాఖ్యల దుమారం..
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై I.N.D.I.A కూటమి నేతలు ఇప్పటికే స్పందించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఈ వ్యాఖ్యల్ని ఖండించింది. మతాల్ని రాజకీయాల్ని కలపొద్దని తేల్చి చెప్పింది. ఫలితంగా కూటమిలో క్రమంగా విభేదాలు మొదలయ్యాయి. కాంగ్రెస్, డీఎమ్‌కే విపక్ష కూటమిలో ఉన్నప్పటికీ ఈ వివాదం విషయంలో మాత్రం అభిప్రాయభేదాలు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ వివాదంలో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని లీడర్స్‌కి హితోపదేశం చేశారు. అటు రాహుల్ గాంధీ కూడా ఇదంతా బీజేపీ ట్రాప్ అని, అందులో పడొద్దని సూచించారు. కాంగ్రెస్ నేత ఆచార్య ప్రమోద్ కూడా ఈ వివాదంపై స్పందించారు. సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మం లేకుండా భారత దేశాన్ని ఊహించుకోలేమని తేల్చి చెప్పారు. ఈ ధర్మాన్ని కించపరచడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని మండి పడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు మనోభావాల్ని దెబ్బ తీస్తాయని, రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులే ఇలా మాట్లాడడమేంటని ప్రశ్నించారు. ఇలాంటి వాళ్లని పదవిలో ఉంచొద్దని అన్నారు.
"సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడమే సెక్యులరిజం కాదు. దేశంలోని చాలా మంది ప్రజల మనోభావాలు దెబ్బ తింటాయి. సనాతన ధర్మం లేకుండా భారత్‌ని ఊహించుకోగలమా? ఈ ధర్మాన్ని అవమానపరచడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఓసారి ఎస్‌పీ పార్టీ నేత అవమానిస్తారు. ఇంకోసారి DMK నేత కించపరుస్తారు. వీళ్లంతా రాజ్యాంగం సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లే కదా. ఇలాంటి వాళ్లు అలాంటి వ్యాఖ్యలు చేస్తే వెంటనే పదవి నుంచి తొలగించాల్సిందే"
- ఆచార్య ప్రమోద్, కాంగ్రెస్ నేత
#WATCH | Haridwar: Congress leader Acharya Pramod says, "Abusing 'Sanatana Dharma' is not Secularism... This act (abusing 'Sanatana Dharma') is hurting several people in the country... One can not even imagine India without Sanatana... Abusing 'Sanatana Dharma' has become a… pic.twitter.com/Kz4Gxm6Lqh
— ANI (@ANI) September 24, 2023
కమల్ కామెంట్స్..
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ చీఫ్ కమల్ హాసన్ సనాతన ధర్మ వివాదంపై స్పందించారు. అనవసరంగా ఉదయనిధి స్టాలిన్‌ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని అన్నారు. కోయంబత్తూర్‌లో పార్టీ మీటింగ్‌కి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ పేరు ఎత్తకుండానే ఓ చిన్న పిల్లాడిపై బీజేపీ దాడి చేస్తోందని విమర్శించారు. కేవలం సనాతన ధర్మం అనే పదం వాడినందుకే ఇంత రభస చేస్తున్నారని మండి పడ్డారు. ఈ వివాదం కొత్తేమీ కాదని, ద్రవిడ ఉద్యమం సిద్ధాంతమే ఇది అని తేల్చి చెప్పారు. ద్రవిడ ఉద్యమం నుంచి వచ్చిన నేతలందరికీ సనాతన ధర్మంపై ఇలాంటి అభిప్రాయమే ఉంటుందని వివరించారు. ఉదయనిధి తాతయ్య డీఎమ్‌కే అధినేత ఎమ్ కరుణానిధి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారని వెల్లడించారు. పెరియార్ వి రామస్వామి ఆయన జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలతోనే అసహనానికి గురై ఉద్యమించారని చెప్పారు. సనాతన ధర్మం అంటే ఏంటో అందరికీ అర్థమైంది కేవలం పెరియార్ వల్లే అని స్పష్టం చేశారు.
Also Read: ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

