ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
Vande Bharat Express: దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను ఒకేసారి ప్రారంభించారు ప్రధాని మోదీ.
Vande Bharat Express:
ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 9 వందేభారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం 11 రాష్ట్రాల్లో 9 కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, వెస్ట్ బెంగాల్, కేరళ, ఒడిశా, ఝార్ఖండ్, గుజరాత్ రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరగనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవభారత స్ఫూర్తికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నిదర్శనమని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ - బెంగళూరు మధ్య, విజయవాడ-చెన్నై మధ్య ఈ కొత్త రైళ్లు అందుబాటులోకి వచ్చాయి.
#WATCH | Prime Minister Narendra Modi virtually flags off nine Vande Bharat Express trains, to help improve connectivity across 11 states namely Rajasthan, Tamil Nadu, Telangana, Andhra Pradesh, Karnataka, Bihar, West Bengal, Kerala, Odisha, Jharkhand and Gujarat. pic.twitter.com/3R3XpUhEVQ
— ANI (@ANI) September 24, 2023
ఫుల్ లిస్ట్ ఇదే..
ఉదయ్‌పూర్-జైపూర్
తిరుణేల్వెలి-మదురై-చెన్నై ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్
విజయవాడ-చెన్నై (వయా రేణిగుంట) ఎక్స్‌ప్రెస్
పట్నా-హౌరా ఎక్స్‌ప్రెస్
కాసరగాడ్-తిరువనంతపురం ఎక్స్‌ప్రెస్
రౌర్కేలా-భువనేశ్వర్-పూరీ ఎక్స్‌ప్రెస్
రాంఛీ హౌరా ఎక్స్‌ప్రెస్
జామ్‌నగర్-అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్
ప్రధాని ఏమన్నారంటే..?
ఎన్నో ఏళ్లుగా కొన్ని రైల్వే స్టేషన్లలో అభివృద్ధే కనిపించలేదని, కానీ తమ హయాంలో 9 ఏళ్లలోనే చాలా రైల్వేలో చాలా సంస్కరణలు తీసుకొచ్చామని వెల్లడించారు ప్రధాని మోదీ. ఆజాదీ కా అమృత్ కాల్ లో భాగంగా ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్ పాస్ అవడాన్నీ ప్రస్తావించారు. భారత్‌లో మహిళల కేంద్రంగా జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రపంచ దేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయని అన్నారు. చంద్రయాన్ 3 విజయవంతం కావడమూ దేశ ప్రజల్లో ఎంతో భరోసాని నింపిందని తెలిపారు. దేశ ప్రజలందరూ ఈ సక్సెస్‌ని గర్వంగా చెప్పుకోవాలని అన్నారు.
"దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్నట్టుగానే వేగవంతంగా మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇవాళ అందుబాటులోకి వచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో ఆయా రాష్ట్రాల ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా సాగుతుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు మరో 9 తోడయ్యాయి. క్రమంగా వందేభారత్ రైళ్ల పాపులారిటీ పెరుగుతోంది. కోట్లాది మంది ప్రజలు ఇప్పటికే ఈ సేవలు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి ఈ రైళ్లు ఎంతగానో తోడ్పడతాయి"
- ప్రధాని నరేంద్ర మోదీ
#WATCH | "Speed, the scale of infrastructure development is matching aspirations of 140 crore Indians...Today people of Rajasthan, Tamil Nadu, Telangana, Andhra Pradesh, Karnataka, Bihar, West Bengal, Kerala, Odisha, Jharkhand and Gujarat will get the facility of Vande Bharat… pic.twitter.com/GDPP3QrVQU
— ANI (@ANI) September 24, 2023
Also Read: రెజ్లర్లను వేధించినట్టు ఆధారాలున్నాయి, బ్రిజ్ భూషణ్‌కి మూడేళ్ల జైలు శిక్ష పడుతుండొచ్చు - ఢిల్లీ పోలీసులు