అన్వేషించండి

Jaishankar: ‘భారత్-చైనా’ మధ్యలో మూడో దేశం అక్కర్లేదు: జైశంకర్ కీలక వ్యాఖ్యలు

India China conflict : భారత్-చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు దేశాల సమస్యల పరిష్కారంలో మూడో దేశం ప్రమేయం అవసరం లేదన్నారు.

Union Minister Jaishankar: భారత్- చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. 2020లో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం ద్వారా చైనా ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఇది ఘర్షణకు దారితీసింది.  రెండు వైపుల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు సమస్యపై మూడో దేశం జోక్యం అక్కర్లేదని స్పష్టం చేశారు.  చైనాతో మాకు సమస్య ఉందని, దానికి మేమిద్దరం పరిష్కారం కనుగొనాలని అన్నారు.

భారత్, చైనా మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించడానికి ఇతర దేశాల వైపు తాము చూడడం లేదన్నారు. పొరుగు దేశాల మధ్య నెలకొన్న సమస్యకు ఇరువురు పరిష్కారం చూపాల్సి ఉందని ఆయన సోమవారం అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో విలేకరుల సమావేశంలో జైశంకర్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్‌, చైనాల మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించేందుకు ఇతర దేశాల వైపు చూడటం లేదు. చైనాతో భారత్ సంబంధాలు బాగా లేవని కూడా అన్నారు. క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో వెళ్లారు. 

మేం చూసుకుంటాం
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, 'భారత్  చైనాల మధ్య సమస్య ఉంది.  ఇది మా దేశాల మధ్య నెలకొన్న వివాదం. దాని గురించి ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కొనుగొనడం మా ఇద్దరి బాధ్యత.  సహజంగానే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ విషయంలో ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే భారత్, చైనా రెండూ పెద్ద దేశాలు. మన సంబంధాల స్థితి మిగిలిన ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. కానీ, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇతర దేశాల వైపు చూడడం లేదు. ఇందులో మూడో దేశం ప్రమేయం అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో రెండుసార్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తాను జరిపిన సమావేశాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.  

తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభనపై చర్చ
జైశంకర్,  వాంగ్ యీ గత వారం లావో రాజధానిలో కలుసుకున్నారు. అక్కడ వారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో మే 2020లో తూర్పు లడఖ్‌లో సైనిక బలగాలను ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ప్రతిష్టంభనను తొలగించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు. సరిహద్దులో శాంతిని తిరిగి తీసుకురావాలని కోరారు. జూలై 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ సందర్భంగా జైశంకర్,  వాంగ్ కజకిస్థాన్ రాజధాని అస్తానాలో కలుసుకున్నారు. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. దశాబ్దాల కాలంలో సరిహద్దులో ఇలాంటి ఘర్షణ జరగడం ఇదే తొలిసారి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాలు ఇప్పటివరకు 21 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతారరివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Embed widget