Russia-Ukraine Conflict: రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మధ్యలో మోదీ- ఇరు దేశాధినేతలతో నేడు చర్చ
Russia-Ukraine Conflict: రష్యా, ఉక్రెయిన్ అధ్యక్షులతో మోదీ ఈరోజు విడివిడిగా ఫోన్‌లో మాట్లాడనున్నారు. ఇరు దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరడంతో శాంతి బాట పట్టాలని మోదీ సూచించే అవకాశం ఉంది.
Russia-Ukraine Conflict: రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ ఈ రోజు ఫోన్‌లో మాట్లాడనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక ఆపరేషన్ చేపట్టినప్పటి నుంచి పుతిన్‌తో మోదీ మాట్లాడటం ఇది మూడోసారి.
పుతిన్ వింటారా?
నాటో కూటమి, పశ్చిమ దేశాలు సహా అమెరికా చెప్పినప్పటికీ పుతిన్ వెనక్కి తగ్గేదేలేదని తేల్చిచెప్పారు. తమ లక్ష్యాన్ని చేరుకునేవరకు సైనిక ఆపరేషన్ ఆపబోమని పుతిన్ స్పష్టం చేశారు. అయితే రష్యా- భారత్ మధ్య బలమైన బంధం ఉన్నందున మోదీ చెబితే పుతిన్ వింటారని ఉక్రెయిన్ పదేపదే చెబుతోంది.
దీంతో ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధం ఆపేలే పుతిన్‌కు సూచన చేయాలని ఉక్రెయిన్ కోరుతోంది.
మరోవైపు జెలెన్‌స్కీ సైతం.. ఐరాసలో ఉక్రెయిన్ వైపు భారత్ నిలవాలని పదేపదే కోరారు. అయినప్పటికీ రష్యాతో ఉన్న సంబంధాల దృష్ట్యా భారత్ ఓటింగ్‌కు దూరం ఉంది.
అంతకుముందు ఫిబ్రవరి 24న మోదీ.. పుతిన్‌తో మాట్లాడారు. హింసను విడనాడి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పుతిన్‌కు మోదీ సూచించారు.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్- రష్యా మధ్య మూడో రౌండ్ చర్చలు- ఈసారైనా ఫలిస్తాయా?
Also Read: Russia-Ukraine Conflict: ఇవే నా చివరి మాటలు కావొచ్చు: జెలెన్‌స్కీ భావోద్వేగం