Russia-Ukraine Conflict: ఇవే నా చివరి మాటలు కావొచ్చు: జెలెన్‌స్కీ భావోద్వేగం
Ukraine Russia War: ఉక్రెయిన్ అధ్యక్షుడు.. వ్లొదిమిర్ జెలెన్‌స్కీ భావోద్వేగపూరితంగా మాట్లాడారు. ఇవే తన చివరి మాటలు కావొచ్చన్నారు.
Ukraine Russia War: ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం దాడులు ఉద్ధృతంగా సాగుతున్నాయి. వందల సంఖ్యలో పౌరులు, వేల సంఖ్యలో సైనికులు మరణిస్తున్నారు. అయితే ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఉక్రెయిన్ ఓవైపు శాంతి చర్చలకు ప్రయత్నాలు చేస్తూనే.. రష్యా దాడులను తిప్పికొడుతోంది. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ భావోద్యేగపూరిత వ్యాఖ్యలు చేశారు.
అమెరికా చట్ట సభలోకి 300 మంది సభ్యులతో దాదాపు గంటపాటు వీడియో కాల్‌లో జెలెన్‌స్కీ మాట్లాడారు. ఈ సందర్భంగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
Breaking! pic.twitter.com/VCL5mpOVMi
— Володимир Зеленський (@ZelenskyyUa) March 6, 2022
10 వేల మంది
మరోవైపు తాము చేసిన పోరాటం కారణంగా ఇప్పటి వరకు 10,000 మంది రష్యన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా చెప్పారు. పలు యుద్ధవిమానాలు, వందలాది యుద్ధ వాహనాలను రష్యా కోల్పోయిందన్నారు. ఉక్రెయిన్‌కు భారీ నష్టం జరుగుతున్నప్పటికీ పోరాటంలో మాత్రం వెనకడుగు వేయట్లేదన్నారు.
వలస
ఉక్రెయిన్లో యుద్ధ సంక్షోభం వల్ల అనేక మంది ప్రజలు వలస వెళ్తున్నారు. ఇప్పటివరకు 1.5 లక్షల మంది దేశం దాటి వెళ్లారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం ఇదేనని పేర్కొంది.
Also Read: Womens Day 2022: మహిళలా మజాకా! 14 జిల్లాల్లో 10 జిల్లాలకు వాళ్లే కలెక్టర్లు
Also Read: International Womens Day 2022: యుద్ధ రంగంలో 'శివంగి'లా- ఎందరో మహిళలకు ఆదర్శంగా