RS 500 Note: రూ.500 నోటులో మహాత్మా గాంధీ చిత్రపటం దగ్గర గ్రీన్ స్ట్రిప్ ఉంటే నకిలీదా?
రూ.500 నోటు సంబంధించి పుకార్లు వస్తున్నాయి. అయితే రూ.500 నోటులో మహాత్మా గాంధీ చిత్రపటం దగ్గర గ్రీన్ స్ట్రిప్ ఉంటే అంది నకిలిదా?
డీమానిటైజేషన్ తర్వాత కొత్త కరెన్సీ నోట్ల గురించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ లో అనేక పుకార్లు వస్తున్నాయి. దొంగ నోట్లు ఎక్కువగా వస్తున్నాయని.. అనేక పుకార్లు వెలువడుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ సంతకానికి దగ్గరగా కాకుండా.. మహాత్మాగాంధీ చిత్రపటం పక్కనే గ్రీన్ స్ట్రిప్‌తో కూడిన రూ.500 నోటు ఉంటే.. అది నకిలీ నోటు అని జాగ్రత్తపడాలని తాజాగా పుకారు లేచింది.
ఈ నోట్లపై పుకార్లు వచ్చాయంటే.. జనాలు, వ్యాపారులు తీవ్రంగా భయపడతారు. ఇతర పుకార్ల మాదిరిగానే దీనితోనూ వారిలో ఆందోళన నెలకొంది. రూ.500 నోటు తీసుకోవడంపై కొంతమందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా (పీఐబీ) మాత్రం ఇది కేవలం పుకారు మాత్రమేనని.. ఆ నోటు నకిలీ కరెన్సీ కాదని పేర్కొంది. అంతేకాదు దానికి సంబంధించి ట్వీట్ చేసింది.
సోషల్ మీడియాలో వస్తున్న ఫేక న్యూస్ పై పీఐబీ స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ ఖాతాల్లో వాస్తవానికి సంబంధించిన విషయాన్ని పోస్ట్ చేసింది. ఆర్‌బీఐ గవర్నర్ సంతకం లేదా మహాత్మా గాంధీ చిత్రం దగ్గర గ్రీన్ స్ట్రిప్‌తో ఉన్న రెండు రకాల రూ. 500 నోట్లు సరైన కరెన్సీ అని వివరిస్తూ పీఐబీ ఒక వీడియోను పోస్ట్ చేసింది.
एक वीडियो में यह चेतावनी दी जा रही है कि ₹500 का ऐसा कोई भी नोट नहीं लेना चाहिए, जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास न होकर गांधीजी की तस्वीर के पास हो।#PIBFactCheck:
— PIB Fact Check (@PIBFactCheck) December 7, 2021
▶️यह वीडियो #फ़र्ज़ी है
▶️@RBI के अनुसार दोनों ही नोट वैध हैं
विवरण:https://t.co/DuRgmS0AkN pic.twitter.com/SYyxG9MBs6
'ఆర్‌బీఐ గవర్నర్ సంతకానికి బదులుగా గాంధీజీ చిత్రపటం దగ్గర గ్రీన్ స్ట్రిప్ ఉన్న 500 రూపాయల నోటును తీసుకోవద్దని పుకార్లతో హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో ఫేక్. RBI ప్రకారం, రెండు నోట్లు చట్టబద్ధమైనవి.' అని పీఐబీ ట్వీట్ చేసింది.
Also Read: Airtel vs Jio vs VI Plans: జియో, ఎయిర్‌టెల్, విలో ఏ ప్లాన్‌కు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయంటే!
Also Read: EPF Interest Credit: ఈపీఎఫ్‌వో 8.5% వడ్డీ చెల్లించింది.. మీకు ఎంతొచ్చిందో ఇలా చెక్ చేసుకోండి!
Also Read: Stock Market Update: ఒక్కరోజే రూ.3.3 లక్షల కోట్ల లాభం..! సెన్సెక్స్, నిఫ్టీ దూకుడే దూకుడు..!