Jharkhand IAS Corruption : మినీ ట్రక్ పట్టేంత నోట్ల కట్టలు - అంతా ఐఏఎస్ ఆఫీసర్‌వే !

జార్ఖండ్ క్యాడర్ ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ కు సంబంధించిన రూ. 19కోట్లను ఈడీ సీజ్ చేసింది. ఆ డబ్బులు మినీ ట్రక్ నిండా పట్టేంత ఉన్నాయి.

FOLLOW US: 

జార్ఖండ్ ఐఏఎస్‌ అధికారిణి పూజా సింఘాల్‌  చార్టెడ్ అకౌంట్‌తో పాటు మరో సన్నిహితుల ఇళ్లలో జరిపిన సోదాల్లో రూ.19.31 కోట్ల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు.  పూజా సింఘాల్‌ ఛార్డర్డ్‌ అకౌంటెట్‌ సుమన్‌ కుమార్‌ వద్ద రూ.17 కోట్లు, మరో చోట రూ.1.8 కోట్లు మేర స్వాధీనం చేసుకున్నట్టు  ఐటీ అధికారులు ప్రకటించారు.  పూజా సింఘాల్ ఉపాధి హామీ నిధుల్ని కొల్లగొట్టినట్లుగా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.  ఈ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉండటంతో ఆకస్మికంగా సోదాలు చేశారు. 

జార్ఖండ్‌ సహా నాలుగు రాష్ట్రాల్లో సోదాలు చేశారు. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న డబ్బును లెక్కపెట్టేందుకు మూడు కౌంటింగ్‌ యంత్రాలను ఉపయోగించారు.  సీజ్‌ చేసిన మొత్తంలో రూ.2000, రూ.500, రూ.200, రూ.100 కట్టలే ఉన్నాయి. ఇలా నోట్ల కట్టలు గుట్టలు గుట్టలుగా ఉండటం.. వాటిని అధికారులు లెక్కిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

పూజా సింఘాల్‌పై కేసు ఇప్పటిద ికాదు. 2007-08కి సంబంధించిన ఈ కేసులో గతంలో  ఓ  జూనియర్‌ ఇంజీనిర్‌ ను అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన సమాచారంతో ఐఏఎస్‌ పూజా సింఘాల్‌  ఇళ్లల్లో సోదాలు చేశారు. చివరికి ఈడీ రంగంలోకి దిగింది. జార్ఖండ్‌, బిహార్‌, రాజస్థాన్‌, పశ్చిమబెంగాల్‌, ముంబయిలలో సోదాలు చేశారు. పూజా సింఘాల్‌ ప్రస్తుతం జార్ఖండ్‌ ప్రభుత్వంలోని మైనింగ్‌, భూగర్భశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

జార్ఖండ్‌లో కాంగ్రెస్- జేఎంఎం కూటమి ప్రభుత్వం ఉంది. పూజా సింఘాల్ వ్యవహారంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ  జరుగుతోంది. ఐఏఎస్ అధికారులు అవినీతి చేస్తే ఇలా పేద ప్రజల సొమ్మును దిగమింగేస్తారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Published at : 07 May 2022 06:14 PM (IST) Tags: IAS Pooja Singhal IAS Pooja Singhal Corruption

సంబంధిత కథనాలు

Rahul Vs S Jaishankar :  అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం - రాహుల్‌గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ !

Rahul Vs S Jaishankar : అది అహంకారం కాదు ఆత్మవిశ్వాసం - రాహుల్‌గాంధీకి విదేశాంగ మంత్రి జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ !

Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!

Gyanvapi Mosque Row: 'జ్ఞానవాపి'పై సుప్రీం విచారణ- మసీదుకు ఒక్కసారిగా 700 మంది ముస్లింలు!

Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ

Gyanvapi mosque case: 'జ్ఞానవాపి మసీదు'పై సుప్రీం కీలక ఆదేశాలు- కేసు వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Mathura Krishna Janmabhoomi: శ్రీకృష్ణ జన్మభూమి వివాదమేంటి? హిందూ- ముస్లింల ఒప్పందంలో ఏముంది?

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Petrol Diesel Prices down: పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింపు - గుడ్‌న్యూస్‌ చెప్పిన నిర్మలమ్మ

Revant Reddy : కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

Revant Reddy :  కేసిఆర్‌ను చెప్పులతో కొట్టుడే గద్దె దింపుడే - జయశంకర్ స్వగ్రామంలో రేవంత్ చాలెంజ్ !

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!

Thailand Open: ప్చ్‌.. సింధు! చెన్‌యూఫీ అనుకున్నంత పనీ చేసేసింది!