Amit Shah Birthday: అమిత్ షాపై ఆర్‌జేడీ ఎమ్మెల్యే సెటైర్లు.. విలన్ ఫొటోలతో విషెస్.. పైగా రీట్వీట్!
మన కేంద్ర హోంమంత్రి ఎవరు అని అడగగానే.. అమిత్ షా అని ఠక్కున చెప్పేస్తారు జనాలు. కానీ ఓ బిహార్ ఎమ్మెల్యేకు మాత్రం దివంగత నటుడు రామిరెడ్డి అట..!
అక్టోబర్ 22న కేంద్ర హోంమంత్రి అమిత్ షా జన్మదినం. ప్రముఖులు చాలా మందే విష్ చేశారు. కానీ బిహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ ఎమ్మెల్యే సురేంద్ర యాదవ్ మాత్రం... అమిత్ షాకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. మనం అంకుశం రామిరెడ్డి ఫొటో పెట్టారు. అదేనండి రాములమ్మ సినిమా విలన్ రామిరెడ్డికి. అమిత్ షా జన్మదినం సందర్భంగా ఓ ట్విట్ వదిలారు సురేంద్ర యాదవ్. అయితే హ్యాపీ బర్త్ డే టూ అవర్ హోం మినిస్టర్ అమిత్ షా అంటూనే ఫొటో మాత్రం రామిరెడ్డిది పెట్టారు. దీంతో ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది. అయితే ఈ ఫొటో కావాలనే పెట్టారా? లేక అనుకోకుండా జరిగిందా అని నెటిజన్లు ఆలోచించారు. కొంతమంది ఆ ట్వీట్ కింద ఫన్నీ కామెంట్లు పెట్టగా కొందరు ఎమ్మెల్యేపై సెటైర్లు వేశారు.
Happy Birthday to our Home Minister @AmitShah Ji. 🙏🏻😌 pic.twitter.com/fPDoBo62x7
— Surendra Prasad Yadav (@iSurendraYadav) October 22, 2021
మరో ట్విస్ట్..
అయితే కాసేపటికే ఆ ఎమ్మెల్యే ఇంకో ట్వీట్ చేశారు. "నన్ను క్షమించాలి.. ఉపఎన్నికల బిజీలో ఉండి.. సరిగా చూసుకోలేదంటూ.. హ్యాపీ బర్త్ డే టూ అమేజింగ్ మోటా బాయ్" అంటూ తమిళ విలన్ సంతాన భారతి ఫొటో పెట్టి అమిత్ షాకి శుభాకాంక్షలు చెప్పారు. ఈ ట్వీట్‌తో సురేంద్ర యాదవ్ ఈ పని కావాలనే చేసినట్లు అర్థమైంది. దీంతో నెటిజన్లు.. ఆయనపై ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
I beg your pardon! Made a blunder in the midst of the hectic campaign of By-election.
— Surendra Prasad Yadav (@iSurendraYadav) October 22, 2021
Happy Birthday to our amazing Mota Bhai! 🎂💐
:) https://t.co/dtevrJIqEL pic.twitter.com/wWz0WGmgPE
రీ ట్వీట్..
ఈ విషయాన్ని 'ఏబీపీ దేశం' వార్త రాసి ఆయనకు ట్యాగ్ చేయగా.. ఎమ్మెల్యే సురేంద్ర యాదవ్ ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు.
ఇదేంటయ్యా ఎమ్మెల్యే.. చూస్కోవాలిగా.. అమిత్ షాకు బదులు 'అంకుశం రామిరెడ్డి'కి విష్ చేస్తే ఎలా?@AmitShah @iSurendraYadav #ramireddy #birthdaywishes https://t.co/ffmwvYf85z
— ABP Desam (@abpdesam) October 24, 2021
సురేంద్య యాదవ్.. 1990 నుంచి బెలగాంజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఓసారి ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.
Also Read: Covid-19 New variant: కరోనా మరో అవతారం.. ఏవై. 4.2.. ఇది చాలా ఫాస్ట్ గురూ! మరి భారత్‌కు వచ్చేసిందా?
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి