Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి
దేశంలో కొత్తగా 15,906 కరోనా కేసులు నమోదుకాగా 561 మంది మృతి చెందారు.
![Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి India Reports 15,906 New COVID Cases With 561 Deaths, Situation Concerning In Bengal Post Durga Puja Corona Cases: దేశంలో కొత్తగా 15 వేల కేసులు నమోదు, 561 మంది మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/24/1530c62cebf292c33c3af53343f507cc_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో కరోనా కేసులు మరోసారి 15వేలకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 15,906 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,41,75,468కి పెరిగింది. గత 24 గంటల్లో 16,479 మంది రికవరయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 3,35,48,605కి చేరింది.
#Unite2FightCorona
— Ministry of Health (@MoHFW_INDIA) October 24, 2021
➡️ Nearly 60 Cr COVID Tests conducted so far.
➡️ Weekly Positivity Rate currently at 1.23%.
➡️ Daily Positivity Rate at 1.19%; less than 2% for 20 consecutive days. pic.twitter.com/aIgSFmFYX2
- కొత్త మరణాలు: 561
- మొత్తం మరణాల సంఖ్య: 4,54,269
- యాక్టివ్ కేసుల సంఖ్య: 1,72,594
More than 106.79 crore vaccine doses provided to States/UTs so far, and over 12 crore unutilized vaccine doses are still available with the States/UTs: Government of India pic.twitter.com/kSh96HsYwl
— ANI (@ANI) October 24, 2021
దేశంలో రికవరీ రేటు 98.17కు పెరిగింది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1 శాతం కంటే తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల శాతం 0.51గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం.
శనివారం 13,40,158 కరోనా పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం పరీక్షల సంఖ్య 59,97,71,320కి చేరింది.
రాష్ట్రాల్లో కరోనా కేసులు..
మహారాష్ట్రలో కొత్తగా 1,701 కరోనా కేసులు నమోదుకాగా 33 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 66,01,551కి పెరిగింది.
బంగాల్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 846 కేసులు నమోదుగాకా 12 మంది మృతి చెందారు.
దిల్లీలో మాత్రం కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 40 కేసులు నమోదుకాగా ఒక్కరు కూడా మరణించలేదు.
కేరళలో మరోసారి కరోనా కేసులు 10 వేల కంటే తక్కువే నమోదయ్యాయి. కొత్తగా 8,909 కేసులు నమోదుకాగా 65 మంది మృతి చెందారు.
Also Read: ఈ క్రికెటర్లు రిచ్చో రిచ్చు! టీ20 ప్రపంచకప్ ఆడేస్తున్న కోటీశ్వరులు వీరే!
Also Read: ఐపీఎల్ క్రేజ్‌కు ఫిదా! కొత్త ఫ్రాంచైజీపై 'మాంచెస్టర్ యునైటెడ్' ఆసక్తి!
Also Read: పాక్‌వి గంభీరమైన ప్రేలాపనలే! దాయాదిపై భారత జైత్రయాత్రకు కారణాలు చెప్పిన వీరూ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)