Hinduphobia On Social Media : సోషల్ మీడియాలో పెరిగిపోతున్న హిందూ ఫోబియా, యూఎస్ వర్సిటీ స్టడీలో సంచలన విషయాలు
Hinduphobia On Social Media : సామాజిక మాధ్యమాల్లో హిందూ వ్యతిరేక ధోరణులు పెరిగిపోతున్నాయని యూఎస్ కు చెందిన ఓ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. హిందుత్వంపై తప్పుడు సమాచారాన్ని గల కారణాలను విశ్లేషించింది.
Hinduphobia On Social Media : సామాజిక మాధ్యమాల్లో హిందూ ఫోబియా అనే అంశంపై అమెరికాకు చెందిన ఓ యూనివర్సిటీ స్టడీ చేసింది. ఈ కేస్ స్టడీలో కీలక విషయాలు తెలిశాయని ఆ యూనివర్సిటీ చెప్పుకొచ్చింది. వర్సిటీలోని నెట్ వర్క్ కాంటాజియన్ ల్యాబ్ ఈ స్టడీ చేసింది. హిందుత్వంపై తప్పుడు సమాచారం, హిందూఫోబియా పై కేస్ స్టడీ చేసినట్లు యూనివర్సిటీ తెలిపింది. హిందూ సమాజంపై సోషల్ మీడియాలో వస్తున్న ధోరణిపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విశ్లేషించారు. సోషల్ నెట్‌వర్క్‌ల భాగస్వామ్యంతో కోడెడ్ లాంగ్వేజ్ అభివృద్ధి చేసి మిలియన్ ట్వీట్‌లను విశ్లేషించినట్లు ప్రొఫెసర్లు తెలిపారు.
కేస్ స్టడీ
సామాజిక మాధ్యమాలలో హిందూ వ్యతిరేక, ద్వేషపూరిత ప్రసంగాలు పెరిగిపోతున్నాయని ఓ సర్వే తేల్చింది. వెస్ట్రన్ మీమ్స్, కోడెడ్ లాంగ్వేజ్ ఉపయోగించి హిందుత్వ ఫోబియాను వ్యాపించేలా చేసే అవకాశం ఉందని యూఎస్ రెట్జర్స్ పరిశోధకులు తెలిపారు. వర్సిటీలోని ఒక విభాగం "హిందూ వ్యతిరేక, తప్పుడు సమాచారం : సోషల్ మీడియాలో హిందూఫోబియా కేస్ స్టడీ", అనే అంశంపై పరిశోధన చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హిందూ సమాజానికి సంబంధించిన ధోరణిని అధ్యయనం చేసింది. కృత్రిమ మేధస్సును ఉపయోగించి సోషల్ నెట్‌వర్క్‌ల భాగస్వామ్యంతో కోడ్ లాంగ్వేజ్ నమూనాను అభివృద్ధి చేసి ఈ స్టడీ చేసినట్లు పరిశోధకులు తెలిపారు.
విద్వేష పూరిత మీమ్స్
టెలిగ్రామ్, ఇతర చోట్ల తీవ్రవాద ఇస్లామిస్ట్ వెబ్ నెట్‌వర్క్‌లలో హిందువుల, శ్వేతజాతీయుల ఆధిపత్యంపై మీమ్స్ ఎలా షేర్ చేస్తున్నారో నివేదికలు వివరిస్తాయని వర్సిటీ తెలిపింది. జులైలో, హిందూ ఫోబిక్ కోడ్ వర్డ్స్, మీమ్స్ పై సిగ్నల్ రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుందని వెల్లడించింది. ఇది వాస్తవంగా హింసను రేకెత్తిస్తుందని గుర్తించింది. భారతదేశంలో మతపరమైన ఉద్రిక్తతలు పెరగడానికి ఇదొక కారణమని తెలిపింది. ద్వేషపూరిత భావాలు పెంచేలా కోడ్ పదాలు, మీమ్స్ , ఇమేజ్ లు వస్తున్నప్పటికీ ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లు గుర్తించడంలేదని తెలిపింది.
హిందూ వ్యతిరేక పద్దతులు
హిందూ సమాజం ఎదుర్కొంటున్న హింస కొత్తేమీ కాదని రెట్జర్స్ యూనివర్సిటీ, మిల్లర్ సెంటర్ ఈగిల్‌టన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ డైరెక్టర్ జాన్ J. ఫార్మర్ జూనియర్ అన్నారు. ఈ స్టడీలో కొత్త విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో ద్వేషపూరిత సందేశాల తీవ్రత, ప్రపంచంలో హింసాత్మక చర్యల మధ్య పరస్పర సంబంధాన్ని గుర్తించామని తెలిపారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, భారతదేశంలోని మైనారిటీలపై హిందువులు మారణహోమానికి పాల్పడుతున్నారని ఆరోపించేందుకు సోషల్ మీడియాలో కొన్ని గ్రూపులు హిందూ వ్యతిరేక పద్ధతులను వ్యాప్తి చేశారన్నారు.
యువతలో అవగాహన
స్టూడెంట్ ఎనలిస్ట్ సుధాకర్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి హిందూ వ్యతిరేక, తప్పుడు సమాచారాన్ని విశ్లేషించడానికి పనిచేశారు. ఓపెన్ సోర్స్ లో ద్వేషపూరిత సందేశాలను ఎలా గుర్తించాలో యువతకు అవగాహన కల్పించడం ఒక ముఖ్యమైన అడుగు అని NCRIలోని చీఫ్ డేటా సైంటిస్ట్ జోయెల్ ఫింకెల్‌స్టెయిన్ అన్నారు. ఎన్‌సిఆర్‌ఐ, రెట్జర్స్ సెంటర్‌లు 2020 నుంచి ఇటువంటి విశ్లేషణల నివేదికలను విడుదల చేస్తున్నాయి. ఇవి విస్తృతమైన, వాస్తవ-ప్రపంచ హింసను ప్రేరేపించడానికి కుట్ర సిద్ధాంతాలు, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను ఉపయోగించడాన్ని పరిశీలిస్తాయి.