(Source: ECI/ABP News/ABP Majha)
Reynolds Pen: ఆ వార్తలన్నీ ఫేక్ - అస్సలు నమ్మకండి - క్లారిటీ ఇచ్చిన రెనాల్డ్స్ కంపెనీ!
తమ కంపెనీ మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని రెనాల్డ్స్ తెలిపింది.
90వ దశకంలో పుట్టిన వారికి రెనాల్డ్స్ పెన్‌తో ఉండే అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సమయంలో చదువుకున్న వారందరూ తమ విద్యార్థి జీవితంలో ఏదో ఒక దశలో రెనాల్డ్స్ బాల్ పాయింట్ పెన్ వాడే ఉంటారు. దీనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఇంక్ అయిపోతే రీఫిల్ మార్చి వాడుకునేవారు, పెన్ విరిగితే మళ్లీ ఇలాంటి పెన్నే కొనేవారు కూడా ఉన్నారు. కానీ కొన్ని సోషల్ మీడియా పోస్టులు అందరి మనసులను ఒక్కసారిగా బరువెక్కించింది.
ఆ సోషల్ మీడియా పోస్టుల్లో ఏం ఉంది?
పెన్నులకు సంబంధించి ఐకానిక్ బ్రాండ్ అయిన రెనాల్డ్స్‌ను మూసి వేస్తున్నారని, ఇకపై రెనాల్డ్స్ పెన్నులు మార్కెట్లో కనిపించవని కొన్ని సోషల్ మీడియా పోస్టులు వచ్చాయి. దీంతో నెటిజన్లు ఈ కలంతో తమ స్నేహం గురించి పోస్టులు పెట్టారు. లాస్ట్ బ్యాచ్ కావడంతో వాటిని కొని గుర్తుగా పెట్టుకోవాలని కూడా కొందరు అనుకున్నారు. రెనాల్డ్స్ పెన్నుల్లో ‘045 రెనాల్డ్స్ ఫైన్ కార్బర్’ పెన్నులు చాలా ఫేమస్. ఈ పెన్నుల్లో లేజర్ టిప్స్ అందించే వారు. దీని కారణంగా ఇంక్ కూడా లీక్ అయ్యేది కాదు. చొక్కాలు పాడవ్వకుండా ఉండేవి. అందుకే వీటిని ఉపయోగించడానికి విద్యార్థులు ఇష్టపడేవారు.
ఆ పోస్టు నిజం కాదన్న రెనాల్డ్స్
అయితే ఈ పోస్టులకు రెనాల్డ్స్ చెక్ పెట్టింది. అందులో ఏమాత్రం నిజం లేదని తమ అధికారిక సోషల్ మీడియా పోస్టుల ద్వారా ప్రకటించింది. భారతదేశంలో తమకు 45 సంవత్సరాల చరిత్ర ఉందని, క్వాలిటీకి, కొత్తదనానికి తాము ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. అలాగే భారతదేశంలో ఇంకా తమకు బలమైన ప్లాన్లు ఉన్నాయని తెలిపింది. ఎటువంటి తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని, అసలైన సమాచారం కంపెనీ వెబ్ సైట్, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారానే లభిస్తుందని తెలిపింది. దీంతో ఈ పుకార్లకు చెక్ పెట్టినట్లు అయింది.
View this post on Instagram
End of an era of the Legend💔🖊️
— Shaurya Veer (@Shauryaveer901) August 25, 2023
Reynolds 045 Fine pen will no longer be available in market 🫡🫡🫡#RipLegend #JawanTrailer #PragyanRover #Sangeetha #Bedurulanka2012 #Pushpa2TheRule #JioFinancial #ThankYouCMSir #Chandrayaan3 #ThankYouCMSir #Afgvspak #HereWeGo #KritiSanon pic.twitter.com/0X2FyO9whG
Reynolds is leaving Indian market 😭😭 , nostalgia hits back. i still remember when i was kid how everybody wanted to use golden trimax ,trimax pens 🤌
— Ashwat nandagawali (@ashwatnandagaw1) August 25, 2023
Every middle class kid used to have jiffy gel pen 😀,sadly we won'tbe able to use them anymore
Some iconic pens from Reynolds pic.twitter.com/wmUWDUoqkP
Farewell, dear #Reynolds pen. 🖋️ You were more than just a writing tool; you were a childhood friend who helped us express our dreams and feelings. Your legacy lives on in the stories and memories you've inked in our hearts. pic.twitter.com/Mua7Wb3VK5
— Richa Sheth (@richasheth) August 25, 2023
XNews-01-
— Vineet Tripathi (@vineet_csa) August 25, 2023
The ultimate favourite,from day one!
Named after Milton Reynolds (1892-1976), entrepreneur and manufacturer of the first ball point pen, the first Reynolds pen debuted in New York at 32nd Street store on October 29, 1945.
Beginning in 1945 of its iconic 045 writing pen. pic.twitter.com/77KCJ9v3C4
Read Also: సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!
Read Also: మీ స్మార్ట్ ఫోన్ ఊరికే స్లో అయిపోతుందా? - అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial