అన్వేషించండి

Rat 'thief': బంగారం దొంగిలించిన ఎలుక - పట్టుకుని రికవరీ చేసిన పోలీసులు !

మహారాష్ట్రలో ఓ ఎలుక బంగారం దొంగతనం చేసింది. సీసీ కెమెరాలు ఉన్నాయని ఆ ఎలుక చూసుకోలేదు...దొరికిపోయింది.

Rat 'thief':  ఎలుకలు మద్యం తాగేశాయి.. డీజిల్ ట్యాంక్‌కు చిల్లు పెట్టాయి.. గోడౌన్లలో బియ్యం తినేశాయి. లాంటి కథలను అప్పుడప్పుడూ పేపర్లలో చదువుతూ ఉంటాం. ఎందుకంటే అవి నిజంగా కథలే. అక్రమాలకు పాల్పడి దొరికిపోయిన తర్వాత ఏదో ఓ కారణం చెప్పాలని అక్రమార్కులు ఆ కథలు చెబుతున్నారు. కానీ నిజంగా ఎలుకలు కూడా దొంగతనం చేస్తాయి. ఈ విషయం సీసీ కెమెరా సాక్షిగా బయటపడింది. ఆ దొంగను అరెస్ట్ చేసి.. చోరీ సొత్తును రికవరీ కూడా చేశారు. 

ముంబైలోని గోకుల్‌ధాం కాల‌నీలో నివాసం ఉండే మహిళ  బ్యాంకులో జ్యూవెల‌రీని డిపాజిట్ చేసేందుకు బంగారం తీసుకుని వెళ్లారు. ఆమె పిల్లలు కూడా ఉన్నారు. దారి మధ్యలో వడాపావ్ తిందామని ఆగారు. బంగారం సంచిని పిల్లలకు ఇచ్చారు. అయితే పిల్లలు ఎక్కడో పడేసుకున్నారు. దీంతో ఆమె ఎవరో దొంగలు ఎత్తుకుపోయి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పది తులాల బంగారం పోయిందని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అక్కడ సీసీ కెమెరాలుండటంతో సులువుగానే దొంగను పట్టుకున్నారు. సొత్తును రికవరీ చేశారు. ఇంతకీ దొంగెవరంటే ఎలుక.

గుడ్‌బై ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఎమోషనల్ అవుతున్న నైన్‌టీస్ కిడ్స్

పిల్లలు వడాపావ్ తిని.. చేతిలో అడ్డం ఎందుకులే అని ఆ బంగారం ఉన్నసంచిని డస్ట్ బిన్‌లో పడేశారు. పక్కనే ఎలుకలు ఉన్నాయి. ఆ డస్ట్ బిన్‌లో పడేసిన వడాపావ్‌లను తీసుకెళ్లి కడుపు నింపుకునే ఎలుకలు.. ఆ సంచిలో కూడా అదే ఉన్నాయనుకుని లాక్కెళ్లాయి, ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి.  ఎలుక‌ల నుంచి బంగారం స్వాధీనం చేసుకుని మ‌హిళ‌కు అప్ప‌గించారు. 

పుట్టుక నుంచి మరణం వరకూ అన్నీ రికార్డే - ఆధార్‌లో రాబోతున్న మార్పులు ఇవే !

మొత్తంగా బంగారం విలువ రూ. ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల వరకూ ఉంటుంది. ఈ కేసు  వైరల్ అయింది. పాపం ఎలుకలు కావాలని చేసింది కాదని.. అవి ఆహారం కోసం చేసిన ప్రయత్నాల్లోభాగంగా దాన్ని తీసుకెళ్లాయని పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. బంగారం రికవరీ చేసి వాటిని వదిలి పెట్టేశారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కేకేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
పీవీ సునీల్ కుమార్ సహా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రఘురామ ఫిర్యాదు
Hyderabad News: చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
చంచల్‌గూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద తీవ్ర ఉద్రిక్తత, రేవంత్ సర్కార్‌కు కొత్త చిక్కులు
Suman About Laddu: తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
తిరుమల లడ్డూ కల్తీపై హీరో సుమన్ సంచలన వ్యాఖ్యలు, పార్లమెంట్‌లో చట్టం తేవాలని డిమాండ్
HYDRA Ranganath: హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
హైడ్రా పరిధి అంతవరకే, ఆ కూల్చివేతలతో మాకు ఏ సంబంధం లేదు: రంగనాథ్
Mujra Party: ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
ముజ్రాపార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్, హైదరాబాద్ పాతబస్తీలో గలీజు పనులు
LULU Back To AP: ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
ఏపీకి తిరిగొచ్చిన లులు, ఆ ప్రాంతాల్లో భారీగా పెట్టుబడులు - చంద్రబాబుకు ధన్యవాదాలు
Best Cars: టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
టాటా సీఎన్‌జీ వర్సెస్‌ మారుతి ఫ్రాంక్స్‌, బ్రెజా సీఎన్‌జీ కార్లలో ఏది బెస్ట్‌?
Delhi Crime: కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
కానిస్టేబుల్‌ను కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి- భయానక దృశ్యాలు
Embed widget