అన్వేషించండి

Rajyasabha: సభలో వెంకయ్య నాయుడు కంటతడి.. వాళ్ల ప్రవర్తనపై ఆవేదన, రాత్రి నిద్రపోలేదంటూ..

కాంగ్రెస్ ఎంపీ ప్రవర్తనపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కలత చెందారు. బుధవారం (ఆగస్టు 11) నాటి సభలో ఆయన కంటతడి పెట్టారు. ఎంపీల ప్రవర్తన చూసి తనకు రాత్రి నిద్రపట్టలేదని ఆవేదన చెందారు.

ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు బుధవారం నాడు రాజ్యసభలో కంటతడి పెట్టారు. ఆయన ఆవేదన చెందుతూ గద్గద స్వరంతో మాట్లాడారు. మంగళవారం నాటి సభలో కాంగ్రెస్ ఎంపీలు పలువురు తీవ్రమైన గందరగోళం సృష్టించారు. ఈ క్రమంలో సభలో ఎంపీల ప్రవర్తనపై తాను కలత చెందానని వెంకయ్య ప్రకటించారు. వారు అలా ప్రవర్తించడంపై రాత్రి అసలు తనకు నిద్రపట్టలేదని ఆవేదన చెందారు. మంగ‌ళ‌వారం స‌భ‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌ల‌పై తాను ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియ‌డం లేదని ఆవేదన చెందారు. ‘స‌భ‌లో ఇలాంటి పరిస్థితుల‌ను టీవీల్లో చూపించ‌డం లేద‌ని ప్రజ‌లు చెబుతున్నారు. ఎందుకు చూపించ‌డం లేదో నాకు తెలియ‌దు. రాజ్యస‌భ టీవీ వీటన్నింటినీ చూపించాలి’’ అని వెంక‌య్య కోరారు.

ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే వెంకయ్య ప్రసంగిస్తూ.. రాజ్యసభలో నిన్న జరిగిన పరిణామాలు, ఎంపీల అనుచిత ప్రవర్తన దురదృష్టకరం. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు అనేది ఒక పవిత్ర దేవాలయం. కానీ కొందరు సభ్యులు సభలో అనుచితంగా వ్యవహరించారు. అధికారుల టేబుళ్లపైకి ఎక్కి రభస చేశారు. పోడియం ఎక్కి నిరసన తెలపడం అంటే గర్భ గుడిలోకి ప్రవేశించి గలభా చేయడమే. నిన్నటి పరిణామాలు తలుచుకుంటే నాకు రాత్రి నిద్రపట్టలేదు. సభలో ఇన్ని రోజులు కార్యకలాపాలు స్తంభించడం మంచిది కాదు’’ అంటూ వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదనతో మాట్లాడారు. ఆ సమయంలో ఆయన చేతులు కూడా వణికాయి. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేశారు. 
Also Read: Huzurabad By-Election: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే.. ప్రకటించిన కేసీఆర్.. ఇంతకీ ఎవరాయన?

రాజ్యసభలో మంగళవారం రైతుల సమస్యను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. దీనిపై చర్చ జరుగుతున్న సందర్భంలో కొందరు కాంగ్రెస్ ఎంపీలు రభస చేశారు. బల్లలు ఎక్కి పేపర్లు, ఫైళ్లు విసిరేస్తూ నిరసన తెలిపారు. కొందరు బల్లలపై గంట సేపటి వరకూ కూర్చొనే ఉన్నారు. ఇంకొందరు వీటి చుట్టూ చేరుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాల చేశారు. దీంతో వెంకయ్య సభను పదే పదే వాయిదా వేశారు. 

లోక్‌సభ నిరవధిక వాయిదా
మరోవైపు, లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్‌ కన్నా ముందే లోక్‌సభ సమావేశాలు ముగిశాయి. విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. ఇప్పటికే పలు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. ముందుగా అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 13 వరకు లోక్‌సభ సమావేశాలు జరగాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Thatikonda Rajaiah vs Kadiyam Sri hari | కడియం కావ్య డమ్మీ అభ్యర్థి... నా యుద్ధం శ్రీహరిపైనే | ABPCM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget