అన్వేషించండి

రైలు టికెట్ క్యాన్సిల్ అయితే ఛార్జీలు ఎప్పుడు వర్తిస్తాయి, IRCTC రూల్స్ తెలుసుకోండి

IRCTC Ticket Cancellation Charges: ఐఆర్‌సీటీసీ ద్వారా ప్రయాణికులు రైలు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అయితే టికెట్ క్యాన్సిల్ అయితే ఛార్జీలు వసూలు చేసే విధానం ఇలా ఉంటుంది.

IRCTC రద్దు ఛార్జీలు: దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది రైలులో ప్రయాణిస్తుంటారు. వీరిలో చాలా మంది చివరి నిమిషంలో హడావుడి వద్దని ముందుగానే టిక్కెట్‌లు బుక్ చేసుకుని ప్రయాణించడానికి ఇష్టపడతారు. చాలాసార్లు ఆన్‌లైన్‌లో కొన్ని రోజులకు ముందే టిక్కెట్‌లు బుక్ చేసుకుంటారు. ఆలస్యంగా బుక్ చేసుకుంటే టికెట్ కన్ఫామ్ కాదు. అటువంటి పరిస్థితిలో ప్రజలు తమ టికెట్ నగదు వాపసు పొందుతారు. కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మరో విషయం హాట్ టాపిక్ అవుతోంది.

ఒక మహిళా యూజర్ తన టికెట్ ఆటోమేటిక్‌గా రద్దు అయిందని సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసింది. ఈ విషయంలో ఆమె తన రైలు టికెట్ క్యాన్సిల్ చేసుకోలేదు. అయినప్పటికీ ఆమె నుండి క్యాన్సిల్ ఛార్జీలు వసూలు చేశారు. ఈ సంఘటన తర్వాత IRCTC మీ టికెట్‌ను రద్దు చేస్తే, అంటే మీ టికెట్ ఆటోమేటిక్‌గా రద్దు అయితే కనుక ప్రయాణికుడు క్యాన్సిలేషన్ ఛార్జీలు చెల్లించాలా అనే ప్రశ్న తలెత్తింది. రైల్వే నియమాలను తెలుసుకుంటే బెటర్. 

IRCTC టికెట్‌ను రద్దు చేస్తే రద్దు ఛార్జీలు వర్తిస్తాయా?

మీరు IRCTC ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే, ఒకవేళ టికెట్ కన్ఫాం కాలేదు, అంటే వెయిటింగ్ లిస్ట్‌లో ఉండిపోయింది. అలాంటి టిక్కెట్‌లు ఆటోమేటిక్‌గా రద్దు అవుతాయి. ఇందులో ఎలాంటి రద్దు ఛార్జీలు వసూలుచేయరు. ఈ పరిస్థితిలో ఆ ప్రయాణికుల ఖాతాకు పూర్తి నగదు తిరిగి వస్తుంది.

మీరు ఈ-టికెట్ బుక్ చేసుకుంటే, చార్ట్ తయారు చేసిన తర్వాత కూడా అది వెయిటింగ్‌లో ఉండిపోతే కనుక సిస్టమ్ దానిని ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ చేస్తుంది. ఇలాంటి టిక్కెట్‌లపై ప్రయాణికులు ఏమీ చేయనవసరం లేదు. అందులో ఎలాంటి కోత ఉండదు. తత్కాల్ టిక్కెట్‌లకు వేరే రూల్స్ ఉన్నాయి. సీటు దొరకకపోయినా కొన్ని క్లర్కేజ్ ఛార్జీలు తగ్గించే అవకాశం ఉంది. 

టికెట్ క్యాన్సిల్ ఛార్జీలు ఎప్పుడు చెల్లించాలి?

మీరు మీ టికెట్‌ను రద్దు చేసుకుంటే అప్పుడు రైల్వే నిబంధనల ప్రకారం ఛార్జీలు చెల్లించాలి. కన్ఫామ్ చేసిన టికెట్‌ను రద్దు చేస్తే, ఛార్జీలు రైలు సమయం ప్రకారం నిర్ణయిస్తారు. స్లీపర్ క్లాస్‌కు సాధారణంగా రూ.120, సెకండ్ ACకి 200 రూపాయలు, ఫస్ట్ ACకి రూ.240 వరకు ఛార్జీలు చెల్లించాలి. 

మీ రైలు ప్రయాణానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేస్తే, పూర్తి ఛార్జీలు వస్తాయి. అప్పటి నుంచి టైమ్ దగ్గర పడేకొద్దీ క్రమంగా మీకు తిరిగొచ్చే నగదు తగ్గుతుంది. అదే సమయంలో, మీరు చార్ట్ తయారు చేయడానికి ముందు వెయిటింగ్ టికెట్‌ను క్యాన్సిల్ చేస్తే, తక్కువ డబ్బులు కట్ అవుతాయి. కానీ చార్ట్ తయారు చేసిన తర్వాత మీ టికెట్ మీద డబ్బు తిరిగి పొందలేరు.

Also Read: 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం- నేరుగా హాజరుకావాలని ఆదేశం 
Kumbh Mela Viral Girl Case: తండ్రిపైనే ఫోర్జరీ, కిడ్నాప్ కేసు పెట్టిన కుంభమేళా వైరల్ గర్ల్ - ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
తండ్రిపైనే ఫోర్జరీ, కిడ్నాప్ కేసు పెట్టిన కుంభమేళా వైరల్ గర్ల్ - ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు
DMK MLA Markandeyan Arrest: విజయ్‌పై అనుచితంగా మాట్లాడితే అరెస్టే - జైలుకెళ్లిన రెండో డీఎంకే ఎమ్మెల్యే - స్టాలిన్ ఫైర్
విజయ్‌పై అనుచితంగా మాట్లాడితే అరెస్టే - జైలుకెళ్లిన రెండో డీఎంకే ఎమ్మెల్యే - స్టాలిన్ ఫైర్
Delhi Parliament CJP Protest: ఢిల్లీలో రణరంగం - పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. అమిత్ షాతో ప్రధాన్ ఎమర్జెన్సీ మీటింగ్ !
ఢిల్లీలో రణరంగం - పార్లమెంట్ ముట్టడికి సీజేపీ యత్నం.. అమిత్ షాతో ప్రధాన్ ఎమర్జెన్సీ మీటింగ్ !

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lenin Collections : లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
లెనిన్ 10 రోజుల కలెక్షన్స్ - 100 కోట్లకు చేరువలో అఖిల్ కొత్త మూవీ
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Tirumala Sarva Darshan Re Entry Facility: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - సర్వదర్శనం క్యూలైన్లలో రీ-ఎంట్రీ ఫెసిలిటీ.. ఇక గంటల తరబడి వేచి చూడక్కర్లేదు!
Double Murder Case : జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
జ్యోతిష్యుడు చెప్పాడని పక్కింటి వాళ్లను చంపేశాడో ఉన్మాది - కోర్టు ఉరిశిక్ష వేసేసింది!
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
Embed widget