రాహుల్ గాంధీ సభ్యత్వం పునరుద్ధరణ- నోటిఫికేషన్ విడుదల చేసిన స్పీకర్ కార్యాలయం
పరువు నష్టం దావా కేసులో సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ అయింది.
రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. సుప్రీంకోర్టు శిక్షపై స్టే విధించిన నాలుగు రోజుల తర్వాత లోక్ సభ సెక్రటేరియట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించేందుకు సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. సోమవారం (ఆగస్టు 7) సాయంత్రంలోగా రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోతే, కాంగ్రెస్ మంగళవారం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయబోయింది. ఇంతలోనే రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని ఇప్పటికే పునరుద్ధరించారు.
2019 ఎన్నికల ర్యాలీలో మోడీ ఇంటిపేరు గురించి చేసిన కామెంట్స్ ఆయన్ని చిక్కుల్లో పడేసింది. 2023 మార్చిలో గుజరాత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష పడిన మరుసటి రోజే లోక్ సభ సెక్రటేరియట్ పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. రాహుల్ గాంధీ 2019 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.