అన్వేషించండి

Rahul Gandhi And Kishori Lal Sharma : రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌- అమేథీ నుంచి న్యూ ఫేస్‌- కాంగ్రెస్ జాబితాలో ట్విస్ట్- ఇంతకీ ఎవరీ కేఎల్‌ శర్మ ?

Amethi-Raebareli Congress Candidate: చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ ట్విస్ట్ ఇచ్చింది. రాయ్‌బరేలీలో రాహుల్‌ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినా హస్తం పార్టీ... అమేథీలో మాత్రం కొత్త ముఖాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

Amethi-Raebareli Congress Candidate: కొన్ని రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు కాంగ్రెస్‌ ఈ ఉదయం(శుక్రవారం, మే 3 2024) తెరదించింది. రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారో ప్రకటించేసింది. రాయ్‌బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుంటే.... అమేథీ నుంచి కిశోరీ లాల్‌ శర్మ బరిలో నిలబడుతున్నారు. 

గురువారం సమావేశమైన కాంగ్రెస్ ఎన్నికల బృందం ఈ రెండు స్థానాలపై సుదీర్ఘంగా చర్చించింది. గురువారం రాత్రి ఈ జాబితాను ప్రకటిస్తారని అంతా అనుకున్నారు కానీ... అనూహ్యంగా నామినేషన్‌కు కొన్ని గంటల ముందు పేర్లను రివీల్ చేసింది కాంగ్రెస్. అందులో ఒక పేరు ఊహించిందే అయినా రెండు పేరు మాత్రం అనూహ్యమే. 

రాయ్‌బరేలీ స్థానంలో రాహుల్ గాంధీ పోటీ చేస్తారని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. కానీ కాంగ్రెస్‌ మాత్రం దీనిపై మౌనం పాటిస్తూ వచ్చింది. చివరి నిమిషంలో క్లారిటీ ఇచ్చింది. నామినేషన్ రోజునే రాహుల్‌ పేరును ప్రకటించింది. ఇవాళ నామినేషన్ అట్టహాసంగా వేసేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతుంది. రాహుల్ నామినేషన్‌ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేతలతోపాటు తల్లి సోనియా గాంధీ కూడా హాజరవుతారని అంటున్నారు. Image

తీవ్రస్థాయిలో చర్చ జరిగిన మరో నియోజకవర్గం అమేథీ. ఈ నియోజకవర్గం కూడా కాంగ్రెస్‌ కుటుంబానికి అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారా అనే డిస్కషన్ జరిగింది. చివరి నిమిషం వరకు ప్రియాంక పేరు వినిపించింది. కానీ ఆఖరి నిమిషంలో కొత్త పేరు తెరపైకి వచ్చింది.  

ఇంతకీ ఎవరీ కిషోరీ లాల్‌ శర్మ?
అమేథీ నుంచి కాంగ్రెస్‌ తరఫున కిశోరి లాల్‌ శర్మను పోటీలోకి దించారు. ఈయన సోనియా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడుగా చెబుతారు. కేఎల్‌ శర్మ స్వస్థలం  పంజాబ్‌లోని లిథియానా. అమేథీలో కాంగ్రెస్‌ ప్రతినిధిగా ఉండే వాళ్లు. ఆ నియోజకవర్గంలో అణువణువూ ఆయనకు తెలుసు. కాంగ్రెస్ ఐడియాలజీని, అప్పటి యూపీఏ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో కీలక పాత్ర పోషించింది ఈయనే. 

Image

రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమేథీలో నామినేషన్ వేసినప్పుడు ఉన్న వ్యక్తుల్లో ఈ కేఎల్‌శర్మ ఒకరు. అప్పటి నుంచి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు చేరువ అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓడిపోయినప్పటికీ నియోజకవర్గంలో తిరుగుతూ వచ్చారు. అంతకు ముందు సోనియాగాంధీ అక్కడ ఎంపీగా ఉన్న టైంలో కూడా నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించే వాళ్లు. వాళ్ల తరఫున అక్కడ ప్రజలకు సేవ చేసేవాళ్లు. 1999 నుంచి ఇప్పటి వరకు పరోక్షంగా ప్రజలకు సేవ చేసిన కేఎల్‌ శర్మ ఇప్పుడు ప్రత్యక్షంగా సేవ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకే ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP DesamCharlapalli Railway Station Tour | 430కోట్లు ఖర్చు పెట్టి కట్టిన రైల్వే స్టేషన్ | ABP DesamUnion Health Minister HMPV Virus | హెచ్ఎంపీవీ వైరస్ ను ఎదుర్కోగల సత్తా మనకు ఉంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
Clash at BJP office Nampally: బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రిక్తత- కర్రలతో కొట్టుకున్న బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు
Harish Rao on KTR Arrest: కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
కేటీఆర్‌ను అరెస్ట్ చేయడం కన్ఫామ్, ఫార్ములా ఈ రేసు కేసుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
Tibet Earthquake: నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
నేపాల్, టిబెట్‌ భూకంపంలో 53 మంది మృతి, సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
KTR News: కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
కేటీఆర్‌కు బిగ్ షాక్, క్వాష్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు - అరెస్ట్ చేయవద్దని చెప్పలేమన్న కోర్టు
NTR Neel Movie: ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
ఎన్టీఆర్ 'డ్రాగన్' కోసం రంగంలోకి మలయాళీ యాక్టర్స్... ప్రశాంత్ నీల్ ప్లాన్ మామూలుగా లేదుగా
Shami Injury Handling: షమీని సరిగా వాడుకోలేదు.. బీజీటీలో తను ఉంటే లెక్క వేరే ఉండేది.. బీసీసీఐపై మాజీ కోచ్ ఫైర్
షమీని సరిగా వాడుకోలేదు.. బీజీటీలో తను ఉంటే లెక్క వేరే ఉండేది.. బీసీసీఐపై మాజీ కోచ్ ఫైర్
Earthquake Alerts on Mobile: మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
మీ స్మార్ట్‌ఫోన్లకు భూకంపం అలర్ట్స్ రావాలా?- ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లు ఇలా చేస్తే సరి
Allu Arjun: సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
సంధ్య థియేటర్ ఘటన... కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించాక మీడియాకు ముఖం చాటేసిన బన్నీ
Embed widget