PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం సక్సెస్, నిర్ణీత కక్ష్యలో మూడు ఉపగ్రహాలు
PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం విజయవంతం అయింది. పీఎస్ఎల్వీ మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది.
PSLV C53 Success : పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగం విజయవంతం అయింది. తిరుపతి జిల్లా శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్వీ మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. పీఎస్ఎల్వీ సీ-53 గురువారం సాయంత్రం 6 గంటల 2 నిముషాలకు నింగిలోకి దూసుకెళ్లింది. 26 గంటలపాటు నిరంతరాయంగా కౌంట్ డౌన్ సాగింది. సింగపూర్ చెందిన 3 శాటిలైట్స్ ప్రయోగించారు. పీఎస్ఎల్వి సీ-53 వాహక నౌక మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లింది. వీటిలో ఒకటి DS-EO, బరువు 365 కిలోలు. ఇంకొకటి సింగపూర్ కి చెందిన న్యూసార్. దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. ఇక మూడో ఉపగ్రహం SCOOB-I. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు 2.8 కిలోలు మాత్రమే. DS-EO ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రో-ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్ ను కలిగి ఉంటుంది. సింగపూర్ కి చెందిన న్యూసార్ ఉపగ్రహం SAR పేలోడ్ ను మోసుకెళ్లే మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పగలు, రాత్రి, అన్ని వాతావరణ పరిస్థితులలో చిత్రాలను అందించగలదు. మూడో ఉపగ్రహం SCOOB-I స్టూడెంట్ శాటిలైట్ సిరీస్ (S3-I), సింగపూర్‌లోని NTU స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లోని శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థులు దీన్ని తయారు చేశారు.
55వ మిషన్
నాలుగు దశలలో ఈ ప్రయోగం జరిగింది. 44.4 మీటర్ల పొడవు గల PSLV-C53 వాహక నౌక. DS-EO ఉపగ్రహాన్ని 570 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మిగతా ఉపగ్రహాలను కూడా కక్ష్యల్లో ప్రవేశపెట్టారు. ఇది PSLV 55వ మిషన్. PSLV-కోర్ అలోన్ వేరియంట్ ను ఉపయోగించి చేస్తున్న 15వ మిషన్ గా అధికారులు ప్రకటించారు. ఇక షార్ సెంటర్ లోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తున్న 16వ పీఎస్ఎల్వీ రాకెట్ ఇది. ఈనెల 30న సాయంత్రం ఆరు గంటల 2 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ సీ-53 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది.
Also Read : PSLV C53 Launch : నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ53, శాటిలైట్ ప్రయోగానికి అమ్మవారి దీవెనలు