(Source: ECI/ABP News/ABP Majha)
Business Reforms Action Plan 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఏపీ టాప్ - విమర్శలు తిప్పికొట్టేందుకు దొరికింది ఛాన్స్
Business Reforms Action Plan 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మరోసారి ఏపీ సత్తా చాటింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఏపీ టాప్ లో నిలిచింది.
Business Reforms Action Plan 2020 : ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాకింగ్స్ లో ఆంధ్రప్రదేశ్ సత్తా చాటింది. మళ్లీ ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్ 2020లో ఆంధ్రప్రదేశ్ టాప్ లో నిలిచింది. టాప్ అచీవర్స్ లో ఉన్న 7 రాష్ట్రాలను కేంద్రం ప్రకటించింది. ఈ జాబితాలో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. 97.89 శాతం స్కోర్ తో ఏపీ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. 97.77 శాతంతో రెండో స్థానంలో గుజరాత్ ఉండగా, తమిళనాడు 96.97 శాతం, తెలంగాణ స్కోర్ 94.86 శాతంతో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం టాప్ అచివర్స్‌లో 7 రాష్ట్రాల పేర్లను ప్రకటించారు.
Seven states are top achievers in Govt's 'Business Reforms Action Plan 2020' report. Andhra Pradesh, Gujarat, Haryana, Karnataka, Punjab, Telangana and Tamil Nadu among best performers. #IndiaMeansBusiness pic.twitter.com/3mD8YmYnwb
— NSitharamanOffice (@nsitharamanoffc) June 30, 2022
ఏపీ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత
టాప్ అచీవర్స్ లో ఏపీతో పాటు గుజరాత్, హరియాణా, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలు ఉన్నాయి. 4 కేటగిరీలుగా రాష్ట్రాలకు ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాప్ అచీవర్స్ లో ఏపీ స్థానం దక్కించుకుంది. గతంలో ఎన్నడూలేని కొత్త విధానాలతో ఈసారి ర్యాంకింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈసారి 10,200 మంది పెట్టుబడిదారులు, స్టాక్ హోల్డర్ల నుంచి అభిప్రాయాల సేకరణ చేశారు. అన్ని రంగాల్లోనూ సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై సానుకూలత వ్యక్తం అయినట్లు తెలుస్తోంది.
నాలుగు కేటగిరీలు
బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020లో ఏపీ టాప్ లో నిలిచింది. టాప్ అచివర్స్‌లో ఆంధ్రప్రదేశ్ లో పాటు గుజరాత్, హరియాణా, కర్నాటక, పంజాబ్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నాలుగు కేటగిరీలుగా ర్యాంకులు ప్రకటించింది. అచివర్స్ లిస్టులో హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. అస్పిరర్స్ లిస్టులో అసోం, ఛత్తీస్‌గఢ్, గోవా, ఝార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. మరోవైపు ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్ విభాగంలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో దిల్లీ, పుదుచ్ఛేరి, త్రిపుర చోటు దక్కించుకున్నాయి.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మరోసారి సత్తా చాటిన ఏపీ ప్రభుత్వం.బిజినెస్ రీఫార్మ్స్ యాక్షన్ ప్లాన్-2020లో టాప్ ప్లేస్లో నిలిచిన ఏపీ.టాప్ అచివర్స్‌లో 7 రాష్ట్రాలను ప్రకటించిన కేంద్రం.దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్. #AndhraPradesh #EaseofDoingBusiness
— YSR Congress Party (@YSRCParty) June 30, 2022