By: ABP Desam | Updated at : 30 Jun 2022 05:48 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
పీఎస్ఎల్వీ సీ53 (Image Source: Isro Twitter)
PSLV C53 Launch : పీఎస్ఎల్వీ సీ-53 ప్రయోగానికి రంగం సిద్ధం అయింది. గురువారం సాయంత్రం 6 గంటలకు PSLV-C53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం నేపథ్యంలో ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సూళ్లూరుపేట చెంగాళమ్మ అమ్మవారి దేవస్థానానికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రయోగానికి ముందు చెంగాళమ్మను ఇస్రో ఛైర్మన్ దర్శించుకోవడం ఆనవాయితీ. ఈసారి కూడా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు సోమనాథ్. సింగపూర్ నుంచి 3 శాటిలైట్స్ ప్రయోగిస్తున్నామని, ఈసారి ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టిన అనంతరం ఈ ఏడాది మరికొన్ని ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పారు. కౌంట్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోందని, సరిగ్గా గురువారం సాయంత్రం 6 గంటల 2 నిముషాలకు పీఎస్ఎల్వీ సీ53 రాకెట్ నింగిలోకి దూసుకెళ్తుందని అన్నారు.
నింగిలోకి మూడు ఉపగ్రహాలు
పీఎస్ఎల్వి సీ-53 వాహక నౌక మూడు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తుంది. వీటిలో ఒకటి DS-EO, బరువు 365 కిలోలు. ఇంకొకటి సింగపూర్ కి చెందిన న్యూసార్. దీని బరువు 155 కిలోలు. రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని స్టారెక్ ఇనిషియేటివ్ శాస్త్రవేత్తలు నిర్మించారు. ఇక మూడో ఉపగ్రహం SCOOB-I. నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ (NTU) రూపొందించింది. దీని బరువు 2.8 కిలోలు మాత్రమే. DS-EO ఉపగ్రహం 0.5 రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఒక ఎలక్ట్రో-ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్ ను కలిగి ఉంటుంది. సింగపూర్ కి చెందిన న్యూసార్ ఉపగ్రహం SAR పేలోడ్ ను మోసుకెళ్లే మొట్టమొదటి చిన్న వాణిజ్య ఉపగ్రహం. ఈ ఉపగ్రహం పగలు, రాత్రి, అన్ని వాతావరణ పరిస్థితులలో చిత్రాలను అందించగలదు. మూడో ఉపగ్రహం SCOOB-I స్టూడెంట్ శాటిలైట్ సిరీస్ (S3-I), సింగపూర్‌లోని NTU స్కూల్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్ లోని శాటిలైట్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థులు దీన్ని తయారు చేశారు.
55వ మిషన్
నాలుగు దశలలో ఈ ప్రయోగం జరుగుతుంది. 44.4 మీటర్ల పొడవు గల PSLV-C53 వాహక నౌక. DS-EO ఉపగ్రహాన్ని 570 కిలోమీటర్ల ఎత్తులో అంతరిక్షంలో ప్రవేశపెడుతుంది. ఆ తర్వాత మిగతా ఉపగ్రహాలను కూడా కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది. ఇది PSLV 55వ మిషన్. PSLV-కోర్ అలోన్ వేరియంట్ ను ఉపయోగించి చేస్తున్న 15వ మిషన్ గా అధికారులు ప్రకటించారు. ఇక షార్ సెంటర్ లోని రెండో లాంచింగ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తున్న 16వ పీఎస్ఎల్వీ రాకెట్ ఇది. ఈనెల 30న సాయంత్రం ఆరు గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-53 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్తుంది.
లక్కుంటే అంతే మరి! టమోటా పట్టినా వజ్రమైపోతుంది!
Weather Latest Update: 13న మరో అల్పపీడనం, ఇంకో వారం వర్షాలే! భారీ గాలులతో ఈ ప్రాంతాలవారికి అలర్ట్: IMD
Gold-Silver Price: ఈరోజు భారీగా పడిపోయిన బంగారం! నేడు వెండి ఎంత తగ్గిందంటే
Petrol-Diesel Price, 11 August: నిలకడగా ఇంధన ధరలు- మీ నగరంలో ఈరోజు ఇలా
Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?
Flag Code: మీ ఇంటి పై జెండా ఎగురవేయాలనుకుంటున్నారా? అయితే ఈ జాగ్రత్తలు పాటించండి
Karimnagar: హత్య చేసి గుట్టుగా అంత్యక్రియలకు, నమ్మేసిన జనం - ఆ తప్పిదంతో పట్టేసిన పోలీసులు
ఉచిత పథకాలపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ- మోదీ, కేజ్రీవాల్ మధ్య మాటల యుద్ధం
Tabu Injured : హైదరాబాద్‌లో హీరోయిన్‌కు గాయాలు - రెప్ప పాటులో కంటికి తప్పిన ప్రమాదం