అన్వేషించండి

PM Modi Tour Cancel: ఎడతెరిపిలేని వర్షాలకు స్తంభించిపోయిన మహారాష్ట్ర - పూణె పర్యటన రద్దు చేసుకున్న మోదీ

Mumbai Rains: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రధానమంత్రి పూణె పర్యటన రద్దైంది. ఆయన ఇవాళ అక్కడ మెట్రో ట్రైన్ ప్రారంభించాల్సి ఉంది.

Maharashtra Mumbai Rain News: మహారాష్ట్రలో నిన్నటి నుంచి వర్షాలు దంచి కొడుతున్నాయి. ముంబై, థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్‌ వణికిపోతున్నాయి. ముందుగానే ప్రభుత్వం అప్రమత్తమైన విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అధికారులందర్నీ సహాయక చర్యలకు పురమాయించింది. ఇప్పటి వరకు కురిసిన వర్షం చూస్తే కొత్త రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 

24 గంటల నుంచి కురుస్తున్న వర్షాలకు ఐదుగురు మృతి 

బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు మహారాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు చనిపోయినట్టు ప్రభుత్వం ప్రకటించింది. థానే రూరల్‌లో పిడుగుపాటుకు గురై ఇద్దరు మృతి చెందారు. ముర్బాద్ తాలూకాలో కూడా పిడుగుపాటుతో ఓ వ్యక్తి మృతి చెందాడు. అంధేరి ముంబైలో డ్రెయిన్‌లో పడి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. రాయ్‌గఢ్‌లో వరదల్లో కొట్టుకుపోయిన మహిళ మరణించారు. 

వర్షాలకు ఈ ప్రాంతాలు అతలాకుతలం

బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం నమోదైందనట్టు అధికారులు చెబుతున్నారు. వర్షాలకు తూర్పు ముంబై, సెంట్రల్ ముంబై, సౌత్ సెంట్రల్ ముంబై  ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ముంబై, థానే, నవీ ముంబై, పాల్ఘర్, పింప్రి చించ్వాడ్, పూణేలోని పాఠశాలలు పూర్తిగా మూసివేశారు. 

స్తంభించిన రోడ్డు రవాణా- ఆలస్యంగా నడుస్తున్న లోకల్ ట్రైన్స్

ముంబైలోని చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయి కనిపిస్తోంది.ట్రాఫిక్ జామ్‌ అయింది. వర్షాలు, భారీగా నీరు నిలిచిపోవడంతో లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. చాలా రైళ్లను రీషెడ్యూల్ చేశారు. షెడ్యూల్ కంటే 3-4 నిమిషాలు ఆలస్యంగా రైళ్లు నడుస్తున్నాయి.

ఎగసి పడుతున్న అలలు

ముంబైలో సముద్రంలో 2.29 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయి. ఇప్పటి వరకు తూర్పు ముంబైలో గరిష్టంగా 170 మిల్లీమీటర్లు, సెంట్రల్ ముంబైలో 117 మిమీ, పశ్చిమ ముంబైలో 108 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబైలో ఇంకా భారీ వానలు పడే అవకాశం ఉంది. 40 కి.మీ నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

పూణె పర్యటన రద్దు చేసుకున్న ప్రధానమంత్రి మోదీ 

భారీ వర్షాలు ఉన్నందున ప్రధానమంత్రి తన పూణే పర్యటన వాయిదా వేసుకున్నారు. పూణెలో మెట్రో రైలును మోదీ ప్రారంభించాల్సి ఉంది. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మోదీ పర్యటించాల్సిన ప్రాంతాలు నీట మునిగాయి. బహిరంగ సభ ప్రాంగణం కూడా నీటితో నిండిపోయింది. దీనికి తోడు, వాతావరణం అనుకూలించడం లేదన్న కారణంతో మోదీ తన పర్యటన రద్దు చేసుకున్నారు. 

Also Read: మహారాష్ట్రలో కుండపోత వానలు- బయటకు రావద్దని ప్రజలకు అధికారుల హెచ్చరిక

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget