అన్వేషించండి

Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!

PM Modi Cabinet | పార్లమెంటు వర్షాకాల సమావేశాలలోపే కేంద్ర మంత్రిమండలి విస్తరణ అని ప్రచారం జరుగుతోంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు, మిత్రపక్షాలకు మోదీ క్యాబినెట్‌లో చోటు కల్పించనున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కేంద్ర మంత్రిమండలి విస్తరణ వర్షాకాల సమావేశాలకు ముందే జరిగే అవకాశం.
  • ఎన్నికలున్న రాష్ట్రాల, చీలిక వర్గాల ఎంపీలకు మంత్రి పదవులు.
  • కొందరు మంత్రులు గవర్నర్లుగా, బీజేపీ సంస్థాగత పదవులలో మార్పులు.
  • నీట్ వివాదంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవిపై ఉత్కంఠ.

Union Cabinet Reshuffle | న్యూఢిల్లీ: కేంద్ర మంత్రిమండలిలో భారీగా మార్పులు చేర్పులు జరగబోతున్నాయని కొన్ని రోజుల నుంచి వినిపిస్తోంది. చివరి క్షణం వరకూ ఏ విషయం బయటకు రాకుండా మోదీ ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను గమనిస్తే.. ఈ వర్షాకాల సమావేశాల్లోపే కేంద్ర క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగవచ్చని తెలుస్తోంది. ఖాళీ అయిన శాఖలతో పాటు త్వరలో ఖాళీ కాబోయే స్థానాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించడంపై చర్చ జరుగుతోంది. ఈ మంత్రివర్గ విస్తరణలో తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ) పార్టీల నుంచి చీలిక వర్గాల నుంచి బీజేపీకి మద్దతు ఇస్తున్న ఎంపీలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు సైతం మంత్రి పదవి దక్కుతుందని కొందరు ఎంపీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

కొందరికి గవర్నర్లుగా అవకాశం..

పశ్చిమ బెంగాల్ నుంచి కొందరు ఎంపీలను కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోనుండగా, మహారాష్ట్రలోని ఏకనాథ్ షిందే నేతృత్వంలోని శివసేన పార్టీ నుంచి ఒక సీనియర్ నేతకు మంత్రి పదవి ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి గుడ్ బై చెప్పి బీజేపీలోకి వచ్చిన ఏడుగురు రాజ్యసభ సభ్యుల్లో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఇందులో ప్రధానంగా రాఘవ్ చద్దా రేసులో ఉన్నారు. మరోవైపు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్ల పదవీ కాలం ముగియనుండటంతో, ప్రస్తుత కేంద్ర మంత్రుల్లో కొందరిని గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఆ పదవులను యువ నేతలకు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. 

Also Read: Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు సారథి నితిన్ నబీన్ టీమ్‌లో యువ నేతలకు కీలక పదవులను అప్పగించేందుకు కసరత్తు జరుగుతోంది. ఇటీవల కొందరు కేంద్ర మంత్రులతో నితిన్ నబీన్ చర్చించారు. కొందరికి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు పార్టీలోనూ పదవుల మార్పులు చేర్పులు ఏకకాలంలో జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. బెంగాల్ మ్యాజిక్ ఇతర రాష్ట్రాల్లోనూ రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ ఇదే సీన్ రిపీట్ అవుతుందని హైదరాబాద్ లోని కార్యక్రమంలో నితిన్ నబీన్ అన్నారు.

ఆ మంత్రి పదవిపైనే ప్రజల చూపు..

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో  కొందరు కేంద్ర మంత్రులకు పదవీ గండం తప్పేలా లేదు. ముఖ్యంగా నీట్ (NEET) ఎగ్జామ్ పేపర్ లీకేజీ వివాదం, సీబీఎస్‌ఈ డిజిటల్ మూల్యాంకన తప్పులతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ పదవీకాలం ముగిసిపోతున్న హర్‌దీప్‌సింగ్ పురీ, బి.ఎల్ వర్మలకు మరో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది.  ఒకరికి ఒకే పదవి రూల్ పాటిస్తారు కనుక యూపీ, ఢిల్లీ పార్టీ బాధ్యతలు చేపట్టిన పంకజ్ చౌధరి, హర్ష్ మల్హోత్రాలు కేబినెట్ నుంచి బయటకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో రవ్‌నీత్‌సింగ్ బిట్టూ, జార్జి కురియన్ ఇటీవల రాజీనామా చేశారు. పంజాబ్ ఎన్నికల కోసం బిట్టూకు మరో ఛాన్స్ లభిస్తుందని సమాచారం.

Frequently Asked Questions

కేంద్ర మంత్రిమండలి పునర్ వ్యవస్థీకరణ ఎప్పుడు జరగవచ్చు?

కేంద్ర మంత్రిమండలిలో మార్పులు వర్షాకాల సమావేశాల లోపే జరగవచ్చని తెలుస్తోంది. ఖాళీ అయిన శాఖలు, త్వరలో ఖాళీ కాబోయే స్థానాల కోసం ఈ పునర్ వ్యవస్థీకరణ జరుగుతుంది.

మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది?

తృణమూల్ కాంగ్రెస్, శివసేన చీలిక వర్గాల నుండి మద్దతు ఇస్తున్న ఎంపీలకు, అలాగే త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల ఎంపీలకు ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ఆశిస్తున్నారు.

ప్రస్తుత కేంద్ర మంత్రులలో ఎవరి పదవికి గండం ఉందని వార్తలు వస్తున్నాయి?

నీట్ పేపర్ లీకేజీ వివాదం కారణంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. రాజ్యసభ పదవీకాలం ముగియనున్న హర్‌దీప్‌సింగ్ పురీ, బి.ఎల్ వర్మలకు మరో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది త్వరలో తేలనుంది.

కొందరు కేంద్ర మంత్రులకు ఎలాంటి కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంది?

కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ గవర్నర్ల పదవీకాలం ముగియనుండటంతో, ప్రస్తుత కేంద్ర మంత్రుల్లో కొందరిని గవర్నర్లుగా నియమించే అవకాశం ఉంది. ఆ పదవులను యువ నేతలకు అప్పగించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget