అన్వేషించండి

Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన

Public Examinations Bill: లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు 2026 ఆమోదం పొందింది. 2024 చట్టం తర్వాత 52 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడి.

Rahul Gandhi Amit Shah Jantar Mantar Controversy: కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన  పబ్లిక్ ఎగ్జామినేషన్  సవరణ బిల్లు, 202  కు లోక్‌సభ బుధవారం  ఆమోదం తెలిపింది. దేశంలో పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడం, ప్రశ్నాపత్రాల లీకేజీలు , ఇతర అక్రమాలకు శాశ్వత ముగింపు పలకడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ కొత్త సవరణలను సభ ముందుకు తెచ్చింది. విపక్షాల నిరసనలు, హంగామా మధ్యనే ఈ కీలక బిల్లును లోక్‌సభ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది.

ఈ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పింఛన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్  కీలక వ్యాఖ్యలు చేశారు.  ప్రభుత్వ పరీక్షల ప్రామాణికతను, విశ్వసనీయతను కాపాడేందుకు కేంద్రం ఎంతటి కఠినమైన నిర్ణయాలకైనా వెనుకాడదని స్పష్టం చేశారు. నీట్  పేపర్ లీక్ ఘటనపై ప్రభుత్వం ఎంతో వేగంగా స్పందించి చర్యలు తీసుకుందని గుర్తుచేసిన ఆయన, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అక్రమార్కుల ఆటకట్టించేలా చట్టపరమైన నిబంధనలను నిరంతరం నవీకరిస్తున్నామని సభకు తెలిపారు. చట్టంలో తెచ్చిన ఈ సవరణలు అభ్యర్థులకు, నిరుద్యోగ యువతకు ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచుతాయని పేర్కొన్నారు.  

అధికారిక గణాంకాలను సభకు వివరించిన మంత్రి జితేంద్ర సింగ్, 2024లో యాంటీ పేపర్ లీక్ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52 ఎఫ్‌ఐఆర్‌లు  నమోదయ్యాయని వెల్లడించారు. అంతేకాకుండా, పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు కారణంగా మనస్తాపానికి గురై విద్యార్థులు చేసుకునే ఆత్మహత్యల శాతంలో ఇటీవలి కాలంలో గణనీయమైన తగ్గుదల కనిపించిందని, ఇది ఈ చట్టం తీసుకొచ్చిన సానుకూల ప్రభావానికి అద్దం పడుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో లీకేజీలకు పాల్పడే వ్యవస్థలపై, ఏజెన్సీలపై మరింత కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.   

 ఈ కీలక బిల్లుపై చర్చ సందర్భంగా లోక్‌సభలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన కాల్పుల ఘటనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యులంటూ కాంగ్రెస్ అగ్రనేత, పక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు సభను తీవ్రంగా కుదిపివేశాయి. ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చి తీవ్ర నిరసనలు, నినాదాలు చేపట్టడంతో సభలో విపరీతమైన గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్షాల ఆందోళనల నడుమనే కేంద్రం బిల్లును సభ ఆమోదం పొందేలా ముందుకు తీసుకెళ్లింది. 

ప్రజా పరీక్షల్లో అవకతవకలకు అడ్డుకట్ట వేసే ఈ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, ప్రతిపక్షాల నిరసనల ఉధృతి తీవ్రం కావడంతో స్పీకర్ లోక్‌సభను గురువారానికి వాయిదా వేశారు.  దేశంలోని  లక్షల మంది విద్యార్థుల, నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ ముఠాలకు నూతన  పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ చట్టం-202 ద్వారా సింహస్వప్నంగా మారనుందని ప్రభుత్వ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Anti Paper Leak Amendment Bill 2026 Passed : పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
పేపర్ లీకులకు ఇక చెక్ - లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు–2026 ఆమోదం - కేంద్ర మంత్రి కీలక ప్రకటన
IPL Brand Value: క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
క‌ళ్లు చెదిరేలా పెరిగిన‌ ఐపీఎల్ బ్రాండ్ వ్యాల్యూ.. నెంబ‌ర్ వ‌న్ జ‌ట్టుగా ఆర్సీబీ సరికొత్త హిస్టరీ!
Rahul Gandhi Latest News:
"విద్యార్థులపై కాల్పులు జరిపించింది హోంమంత్రి, ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో విద్యావ్యవస్థ" లోక్‌సభలో రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Rahul Gandhi Speech In Parliament: కొందరు మూర్ఖులు ఎవరి మాట వినరు, తమకు నచ్చిందే చేస్తారు? రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభలో దుమారం
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Legislative Council MLC Elections: కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
కూటమికి ఎమ్మెల్సీల పంట - వచ్చే 3 ఏళ్లలో 30 పదవులు - ఆశావహులందరికీ చాన్స్ ?
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
స్పీడ్ లవర్స్‌కు గుడ్ న్యూస్‌.. కొత్త 2027 కవాసాకి నింజా 300 వచ్చేసింది, అప్పుడే డెలివరీలు కూడా ప్రారంభం
2027 కవాసాకి నింజా 300 ఎంట్రీ.. యూత్‌ కోసం స్మూత్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, పవర్‌లో తగ్గేదేలే!
Fridge Water : వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
వర్షాకాలంలో ఫ్రిజ్‌లో నీరు ఎక్కువ రావడానికి కారణాలు ఇవే.. ఈ సెట్టింగ్ మార్చి చెక్ పెట్టేయండి
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Embed widget