అన్వేషించండి

PM Modi: బ్రేకింగ్.. 10 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం.. పీఎంవో ప్రకటన, సర్వత్రా ఆసక్తి

గురువారంతో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు (అక్టోబరు) ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) శుక్రవారం ఉదయం 7 గంటలకు ఓ ట్వీట్ చేసి ప్రకటించింది. గురువారంతో భారత్‌లో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాతి రోజే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వ్యాక్సిన్ డోసుల గురించి ప్రసంగిస్తారా? లేక ఇంకేదైనా కీలక ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. నిన్న వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును దాటిన సందర్భంగా దిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిని మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి డాక్టర్లతో, ఇతర వైద్యఆరోగ్య సిబ్బందితో కాసేపు ముచ్చటించారు.

Also Read: మోడీ ప్రభుత్వం అందిస్తున్న ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా? వాటి ప్రయోజనాలు తెలుసుకోండి

ప్రధాని మోదీ శుక్రవారం తన ట్విటర్ ప్రొఫైల్ పిక్చర్‌ను మార్చారు. దేశంలో కరోనా వ్యాక్సిన్ డోసులు 100 కోట్ల మార్కును దాటిన వేళ ఈ సందర్భంగా మోదీ తన ట్విటర్ ఫోటోను మార్చారు. ఆ ఫోటోలో కరోనా వ్యాక్సిన్ డోసులు దేశంలో 100 కోట్లు దాటాయనే అర్థం వచ్చేలా ‘కంగ్రాట్యులేషన్స్ ఇండియా’ అని ఉంది.

Also Read: Covid Vaccination Landmark: '100 కోట్ల టీకా' ఘనత గీతం విన్నారా? అదిరిపోయింది కదా!

‘‘భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసానికి, ఐకమత్యానికి ఇది ప్రతీక. భారత శాస్త్రవేత్తల కృషికి ఇది ప్రతిఫలం. 100 కోట్ల టీకా డోసుల పంపిణీ చేసినందుకు దేశానికి శుభాకాంక్షలు. ఈ ఘనత సాధించినందుకు వైద్యులు, నర్సులకు నా కృతజ్ఞతలు.’’ అని ప్రధాని మోదీ నిన్న (అక్టోబరు 22) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

కరోనా వ్యాక్సిన్లను పంపిణీ చేసి 100 కోట్ల మార్కును దాటడంలో చైనా తర్వాత భారత్ నిలవడం ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాక, కరోనా విలయం ఏర్పడిన నాటి నుంచి ప్రధాని మోదీ జాతినుద్దేశించి మాట్లాడిన పదో ప్రసంగం ఇది అవుతుంది. కరోనా వ్యాక్సినేషన్ దేశంలో ఇవ్వడం ప్రారంభించిన 9 నెలల్లోనే 100 కోట్ల డోసులు ఇచ్చిన మార్కును భారత్ అధిగమించింది.

Also Read: Diwali Bank Offers: కస్టమర్లకు ఆఫర్లే ఆఫర్లు! దీపావళికి ఏ బ్యాంకు ఏ ఆఫర్‌ ఇస్తోందో తెలుసా?

Also Read: Cruise Ship Drug Case: అనన్యా పాండే ల్యాప్‌టాప్‌లో ఏముంది? ఆర్యన్ వాట్సాప్‌ ఛాట్‌లో ఆమె పేరు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget