PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ
PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశాను కదా అని సరిపెట్టుకునే తత్వం తనది కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi: 2024 సాధారణ ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రధాని అభ్యర్థిని మారుస్తుందని కొన్ని ఊహాగానాలు వినిపిస్తోన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండుసార్లు ప్రధానిగా చేశాను కదా అని సరిపెట్టుకునే తత్వం తనది కాదని మోదీ అన్నారు.
Senior Opposition leader told me becoming Prime Minister twice is enough, reveals PM Modi
— ANI Digital (@ani_digital) May 13, 2022
Read @ANI Story | https://t.co/NBdSJbe5Rv#PrimeMinister #PMModi pic.twitter.com/WcpJ6yIbHd
అయితే సదరు నేత పేరు మోదీ ప్రస్తావించకపోయినా ఆ సలహా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ ఇచ్చి ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
కార్యక్రమం
గుజరాత్‌లోని బరూచ్‌లో గురువారం జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో వర్చువల్ విధానంలో మోదీ పాల్గొన్నారు. వృద్ధులు, వితంతువులు, విధి వంచిత పౌరులను దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన పథకాలను వందశాతం అమలుచేసిన సందర్భంలో బరూచ్‌లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాట్లాడిన ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు వందశాతం అమలయ్యేలా చూడాలన్నదే ఒక నేతగా తన కల అని మోదీ అన్నారు. ప్రధాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: Chhattisgarh Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి
Also Read: Coronavirus Update: దేశంలో కొత్తగా 2,841 కరోనా కేసులు- 9 మంది మృతి