Chhattisgarh Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి
Chhattisgarh Helicopter Crash: ఛత్తీస్‌గఢ్‌లో ఓ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు.
Chhattisgarh Helicopter Crash: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రాజధాని రాయ్‌పూర్‌లో ఓ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. హెలికాప్టర్ ల్యాండింగ్ చేస్తోన్న సమయంలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది.</p
Helicopter crashes at airport in Chhattisgarh's Raipur, two pilots killed
— ANI Digital (@ani_digital) May 12, 2022
Read @ANI Story | https://t.co/jsi3EKndt2#Chhattisgarh #helicopter #choppercrash pic.twitter.com/BvJTyZZtOP
ఇలా జరిగింది
రాయ్‌పూర్ విమానాశ్రయంలో ప్రభుత్వ హెలికాప్టర్ గురువారం రాత్రి 9.10 గంటల ప్రాంతంలో కుప్పకూలింది. హెలికాప్టర్‌ను ల్యాండింగ్ చేస్తున్న సమయంలో మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో అందులో ఇద్దరు పైలట్లు ఉన్నారు. వీరిద్దరూ మృతి చెందారు. మృతి చెందిన పైలట్లు కెప్టెన్ గోపాల్ కృష్ణ పాండా, కెప్టెన్ శ్రీవాస్తవగా గుర్తించారు.
రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో రాత్రి ఫ్లయింగ్ ప్రాక్టీస్ సందర్భంగా ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) దర్యాప్తునకు ఆదేశించింది.
సీఎం విచారం
अभी रायपुर में एयरपोर्ट पर स्टेट हेलीकॉप्टर के क्रैश होने की दुखद सूचना मिली.
— Bhupesh Baghel (@bhupeshbaghel) May 12, 2022
इस दुखद हादसे में हमारे दोनों पायलट कैप्टन पंडा और कैप्टन श्रीवास्तव का दुखद निधन हो गया है।
इस दुःख की घड़ी में ईश्वर उनके परिवारजनों को संबल एवं दिवंगत आत्मा को शांति प्रदान करे।
ॐ शांति:
హెలికాప్టర్ ప్రమాద ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ విచారం వ్యక్తం చేశారు. మరణించిన ఇద్దరు పైలట్లకు నివాళులు అర్పించారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ భూపేశ్ బఘేల్ ట్వీట్ చేశారు.
Also Read: Coronavirus Update: దేశంలో కొత్తగా 2,841 కరోనా కేసులు- 9 మంది మృతి
Also Read: Southwest Monsoon: అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి వర్షాలు- గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ