Coronavirus Update: దేశంలో కొత్తగా 2,841 కరోనా కేసులు- 9 మంది మృతి
Coronavirus Update: దేశంలో రోజువారి కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదయ్యాయి.
Coronavirus Update:
దేశంలో కొత్తగా 2,841 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 3,295 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 9 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 4,31,16,254కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 18,604గా ఉంది.
2,841 new COVID19 cases recorded in India today; Active cases at 18,604 pic.twitter.com/NiNSNT7ILE
— ANI (@ANI) May 13, 2022
మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.04గా ఉంది. రికవరీ రేటు 98.74గా ఉంది.
మొత్తం రికవరీల సంఖ్య 4,25,73,460కి చేరింది. మొత్తం మరణాల సంఖ్య 5,24,190కి పెరిగింది.
డైలీ పాజిటివిటీ రేటు 0.58గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 0.69గా ఉంది.
వ్యాక్సినేషన్
దేశవ్యాప్తంగా గురువారం 14,03,220 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,90,99,44,803కి చేరింది. ఒక్కరోజే 4,86,628 కరోనా టెస్టులు నిర్వహించారు. కరోనా కేసులు స్థిరంగా కొనసాాగుతుండటంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందజేయాలని సంకల్పంతో ఉంది.
దిల్లీలో
దిల్లీలో కొత్తగా 1,032 కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు 3.64గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 18,98,173కు చేరింది. మరణాల సంఖ్య 26,184కు పెరిగింది. 3,743 మంది దిల్లీలో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
Also Read: Southwest Monsoon: అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి వర్షాలు- గుడ్ న్యూస్ చెప్పిన ఐఎండీ