PM Modi: జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా.. 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్

జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా ఇవ్వనున్నట్టు ప్రధాని మోడీ తెలిపారు. జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్ డోస్ అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు.

FOLLOW US: 

కరోనా నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతీని ఉద్దేశించి.. ప్రసంగించారు. జనవరి 3 నుంచి పిల్లలకు కొవిడ్ టీకా ఇవ్వనున్నట్టు తెలిపారు. జనవరి 10 నుంచి ఆరోగ్య కార్యకర్తలకు బూస్టర్​ డోసు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

ఒమిక్రాన్‌ నివారణకు టీకా, జాగ్రత్తలే మందు. మనమంతా అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ వల్ల ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఒమిక్రాన్‌ వస్తోందని ప్రజలు ఎవరూ భయాందోళనకు గురికావొద్దు. మాస్కులు ధరిస్తూ, శానిటైజ్​ చేసుకుంటూ ఉండండి. ఇవాళ దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 18 లక్షల ఐసోలేషన్​ పడకలు ఉన్నాయి. 5 లక్షల ఆక్సిజన్​ పడకలు సిద్ధంగా ఉన్నాయి. కోటీ 40 లక్షల ఐసీయూ బెడ్లు ఉన్నాయి.  చిన్నారుల కోసం 90 వేల పడకలు సిద్ధంగా ఉన్నాయి. ఒమిక్రాన్‌ నివారణకు టీకా, జాగ్రత్తలే మందు. అనేక రాష్ట్రాల్లో వందశాతం కరోనా వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
                                                                                                                    - నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి, 

గోవా, హిమాచల్‌ వంటి రాష్ట్రాల నుంచి వ్యాక్సినేషన్‌ లక్ష్యాన్ని చేరుకుందన్న వార్తలు వచ్చినప్పుడు గర్వంగా ఉంటుందని ప్రధాని మోడీ అన్నారు. త్వరలో నాసికా వ్యాక్సిన్‌, ప్రపంచంలోనే తొలి డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా మన దేశంలోనే ప్రారంభమవుతుందని వెల్లడించారు. కరోనా ఇంకా పోలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలని మోడీ అన్నారు.

వైద్య సిబ్బంది కఠోర శ్రమ వల్లే వందశాతం వ్యాక్సినేషన్‌ సాధ్యమైందని ప్రధాని అన్నారు. 11 నెలలుగా దేశంలో వ్యాక్సినేషన్ ఉద్యమం కొనసాగుతోందని.. అనేక దేశాలతో పోలిస్తే వ్యాక్సినేషన్‌లో మన దేశం ముందుందన్నారు. కరోనా భయం ఇంకా పూర్తిగా పోలేదని గుర్తించాలని.. దేశంలోని 90 శాతం వయోజనులకు కొవిడ్‌ టీకా మొదటి డోసు పంపిణీ పూర్తయిందన్నారు. 

జనవరి 3, 2022 నుంచి దేశంలో 15 నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకాలు వేయడం ప్రారంభమవుతుందని మోడీ పేర్కొన్నారు. పాఠశాల, కళాశాలలకు వెళ్లే చిన్నారులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలు కూడా తగ్గనున్నాయని చెప్పారు.. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ కార్మికులకు బూస్టర్ డోస్ ఇస్తారని..  జనవరి 10, 2022 నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఇది కాకుండా, తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న 60 ఏళ్లు పైబడిన వారికి కూడా బూస్టర్ డోస్ ఇస్తారని తెలిపారు. వాళ్లు మత్రం వైద్యుల సలహా మేరకు తీసుకోవాలని చెప్పారు.

Also Read: Vaccination: అతి త్వరలో పిల్లలకు కొవిడ్ టీకా..  'భారత్​ బయోటెక్'​ కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

Also Read: Omicron Cases: రాజస్థాన్ లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు!

Also Read: Karnataka Corona Cases: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

Published at : 25 Dec 2021 10:35 PM (IST) Tags: coronavirus COVID-19 PM Narendra Modi Narendra Modi Covid Booster Covid-19 vaccination Covid Vaccine For Children coronavirus vaccination omicron variant Covid vaccine booster pm modi on corona children vaccination age

సంబంధిత కథనాలు

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!

Commonwealth Games 2022: కాంస్యం గెలిచిన మహిళా హాకీ జట్టుకు ప్రధాని అభినందనలు!

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

ప్రధాని మోదీకి పాకిస్థాన్‌లో ఓ సిస్టర్ ఉంది, రాఖీ కూడా పంపింది

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?

Flag Hoisting: జాతీయ జెండాను RSS ఎందుకు ఎగరేయటం లేదు? కాషాయ రంగుని మాత్రమే గుర్తిస్తోందా?

JEE Advanced 2022 registration : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి!

JEE Advanced 2022 registration : నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్ డ్ రిజిస్ట్రేషన్, ఇలా దరఖాస్తు చేసుకోండి!

టాప్ స్టోరీస్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!