Vaccination: అతి త్వరలో పిల్లలకు కొవిడ్ టీకా..  'భారత్​ బయోటెక్'​ కొవాగ్జిన్‌కు డీసీజీఐ అనుమతి

అతి త్వరలో పిల్లలకు కొవిడ్ టీకా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు భారత్ బయోటెక్ కొవిడ్ టీకా కొవాగ్జిన్ కు డీసీజీఐ అనుమతి లభించింది.

FOLLOW US: 

భారత్​లో అతి త్వరలో పిల్లలకు కొవిడ్‌ టీకా అందుబాటులోకి వస్తుంది. భారత్‌ బయోటెక్‌ కొవిడ్‌ టీకా కొవాగ్జిన్​ అత్యవసర వినియోగానికి డీసీజీఐ(భారత ఔషధ నియంత్రణ మండలి) అనుమతినిచ్చింది. అధికారిక వర్గాలు  ఈ విషయాన్ని వెల్లడించాయి. 12 నుంచి 18 ఏళ్లలోపు వారికి భారత్‌ బయోటెక్ కొవిడ్‌ టీకాను త్వరలో వేయనున్నారు. పిల్లలకు ఇండియాలో మొదటి టీకా కొవాగ్జిన్‌ అవనుంది.

'భారత్ బయోటెక్ కొవాగ్జిన్ 12 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి పొందింది' అని ANI తెలిపింది. అంతకుముందు భారత్ బయోటెక్.. 2 నుంచి 18 ఏళ్ల వారికి.. వ్యాక్సినేషన్ కోసం క్లినికల్ ట్రయల్స్ డేటాను..సెంట్రల్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కి సమర్పించింది.

ఇటీవలే సీరం సంస్థ ప్రకటన
కొవిడ్ మహమ్మారి నుంచి చిన్నారులను రక్షించేందుకు ఆరు నెలల్లోనే పిల్లల టీకాను తీసుకురాబోతున్నట్లు సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ఇటీవలే ప్రకటించారు. కొవొవాక్స్‌ వ్యాక్సిన్ ట్రయల్స్ జరుగుతున్నాయన్నారు. 3 ఏళ్లు పైబడ్డ పిల్లలందరికీ ఈ టీకాను ఇవ్వొచ్చని స్పష్టం చేశారు.

" మరో ఆరు నెలల్లో చిన్నారుల కోసం కొవిడ్ టీకా తీసుకురానున్నాం. అదృష్టవశాత్తు చిన్నారుల్లో కొవిడ్‌ తీవ్రమైన అనారోగ్యం కలిగించడం లేదు. ఇప్పటికే భారత్‌లో రెండు కంపెనీలకు చెందిన కొవిడ్‌ టీకాలు చిన్నారులకు ఇచ్చేందుకు అనుమతి పొందాయి. చిన్నారులకు టీకా వేయించాలనుకునే వారు ప్రభుత్వ ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. పిల్లలకు కొవిడ్ నుంచి రక్షణ కల్పించే కొవొవాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. 3 ఏళ్లు పైబడిన చిన్నారులను ఈ టీకా ఇవ్వొచ్చు.                                                   "
                                                                  -అదర్ పూనావాలా, సీరం ఇన్‌స్టిట్యూట్ సీఈఓ

ప్రస్తుతం సీరం సంస్థ ఉత్పత్తి చేస్తున్న కొవిషీల్డ్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే ఇస్తున్నారు. కొవిడ్ వంటి మహమ్మారులపై పోరాడే శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని పూనావాలా అభిప్రాయపడ్డారు. మన ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉందన్నారు. 

Also Read: Karnataka Corona Cases: కర్ణాటకలో కరోనా కలకలం... 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్

Also Read: Omicron Cases: రాజస్థాన్ లో ఒక్కరోజే 21 ఒమిక్రాన్ కేసులు.. ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు!

Also Read: Omicron Treatment: ఒమిక్రాన్‌ చికిత్స..! దిల్లీలో పేషెంట్లకు ఇస్తున్న మందులివే..!

Published at : 25 Dec 2021 09:48 PM (IST) Tags: Covaxin Bharat Biotech DCGI Children vaccination CDSCO Vaccination To Children Child Corona Vaccination Covaxin For Children

సంబంధిత కథనాలు

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

Maharashtra Political Crisis: దమ్ముంటే ఎన్నికల బరిలోకి దిగండి, రెబల్ ఎమ్మెల్యేలకు ఆదిత్య థాక్రే ఛాలెంజ్

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

PM Modi Mann Ki Baat: వ్యక్తిగత స్వేచ్ఛను లాగేసుకున్న రోజులవి, మన్‌కీ బాత్‌లో ఎమర్జెన్సీపై ప్రధాని ప్రస్తావన

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Indian Abortion Laws: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి?  ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?

Jammu and Kashmir Encounter: నక్కి ఉన్న ఉగ్రవాదులను బయటకు లాగుతూ, కశ్మీర్‌ లోయలో వరుస ఎన్‌కౌంటర్‌లు

Jammu and Kashmir Encounter: నక్కి ఉన్న ఉగ్రవాదులను బయటకు లాగుతూ, కశ్మీర్‌ లోయలో వరుస ఎన్‌కౌంటర్‌లు

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సంక్షోభంలోకి రష్మీ ఎంట్రీ! మీ భర్తలకు చెప్పుకోండమ్మా అంటూ విజ్ఞప్తి

Maharashtra Political Crisis: మహారాష్ట్ర సంక్షోభంలోకి రష్మీ ఎంట్రీ! మీ భర్తలకు చెప్పుకోండమ్మా అంటూ విజ్ఞప్తి

టాప్ స్టోరీస్

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

AP Elections 2024: టీడీపీ సింగిల్‌గా బరిలోకి దిగితే ఎన్ని సీట్లు నెగ్గుతుందో చెప్పిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే

T Hub Pics: టీ హబ్ 2.0 రెడీ, అబ్బురపరిచే నిర్మాణ శైలి! గాల్లోనే ఎక్కువ భాగం బిల్డింగ్ - ప్రారంభం ఎప్పుడంటే

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

TSRTC News: ఫలించిన సజ్జనార్ వ్యూహాలు - క్రమంగా గట్టెక్కుతున్న టీఎస్ఆర్టీసీ! ఈసారి భారీగా తగ్గిన నష్టం

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు

70 years For Devadasu: అలనాటి క్లాసిక్ 'దేవదాసు'కు డెబ్భై ఏళ్ళు