Modi US Tour : న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐలను ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం- పుష్ప అంటే అర్థం చెప్పిన పీఎం
Modi US Tour: భారత్ అవకాశాల కోసం ఎదురు చూసే రోజులను అధిగమించి.. అవకాశాలు సృష్టిస్తోందన్న మోదీ.. ప్రవాస భారతీయులు భారత అంబాసిడర్లలా వ్యవహరిస్తున్నారన్న ప్రధాని.. న్యూయార్క్ సదస్సులో దేవీశ్రీ పాట
Modi US Tour : అమెరికా పర్యనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ.. న్యూయార్క్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సదస్సులో పాల్గొన్నారు. లాంగ్‌ఐలాండ్ పరిధి నసావ్ వెటరన్స్ కొలీజియంలో జరిగిన ఈ సదస్సులో ప్రవాసులు వేలాదిగా పాల్గొన్నారు. మూడోసారి భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత.. భారత్‌ను సమున్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మూడింతల బలంతో పని చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది భారత్‌లో సుదీర్ఘమైన కఠినమైన ఎన్నికలను ఎదుర్కొన్నామన్న మోదీ.. మరోసారి ప్రజల కోసం మోదీ సర్కార్ వచ్చిందన్నారు. 60 ఏళ్ల తర్వాత మొదటిసారి ఇలా జరిగిందని.. మూడోసారి అధికారం చేపట్టడంపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
మూడోసారి ఎన్నికయ్యాక.. మరింత సమున్నత లక్ష్యాలు పెట్టుకున్నాం:
దేశ ప్రజలు అత్యంత గొప్ప తీర్పు వెల్లడించారన్న మోదీ.. సమున్నత లక్ష్యలా సాధనే ఇప్పటి వరకూ నిర్ణయాలు సాగాయన్నారు. ప్రతి భారతీయుడు భారత్‌లో ఉన్న అవకాశాల పట్ల , లక్ష్యాల సాధనపట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నారని మోదీ పేర్కొన్నారు. అవకాశాల కోసం ఎదురు చూసే రోజులు పోయాయని.. అవకాశాల సృష్టిపైనే ఇప్పుడు అందరూ దృష్టి పెట్టారని తెలిపారు. గత పదేళ్ల వ్యవధిలోనే తమ సర్కారు దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయట పడేసిందని ప్రవాసులకు మోదీ గుర్తుచేశారు. పాత దోరణులను పక్కన పెట్టడం వల్లే ఇదంతా సాధ్యం అయిందని అన్నారు. భారత్‌లో ఇప్పుడు నవీన మధ్యతరగతి కుటుంబాలు పుట్టుకొచ్చాయని.. అవి భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లగలవని ఆకాంక్షించారు. తన జీవితం మొత్తాన్ని ఉత్తమ పాలన సహా సుసంపన్న భారత నిర్మాణానికే అంకితం ఇచ్చినట్లు మోదీ స్పష్టం చేశారు. తాను ఎప్పుడూ ముఖ్యమంత్రి లేదా ప్రధాన మంత్రి అవుతానని కూడా అనుకోలేదని.. కానీ తనకు ఎదురైన ప్రతి పదవిని బాధ్యతతోనే నిర్వర్తించానని చెప్పారు. ప్రవాసులకు మరింత దగ్గరగా ఉండడం కోసం లాస్‌ఏంజెల్స్‌తో పాటు బోస్టన్లో రెండు భారత రాయబార కార్యాలయాలు తెరవనున్నటలు మోదీ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలతో యుద్ధం గురించి ఆలోంచించాల్సిన సమయం కాదన్న మోదీ.. ప్రపంచం ఎప్పుడు సమస్యల్లో ఉన్నా భారత్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
Thank you New York! These are glimpses from the memorable community programme. Grateful to all those who joined. @ModiandUS pic.twitter.com/2OokNwYTb2
— Narendra Modi (@narendramodi) September 23, 2024
బైడెన్ ఇంటికి తాను వెళ్లడం.. 140 కోట్ల మందికి అందిన గౌరవం :
ఈ సమావేశానికి దాదాపు 40 రాష్ట్రాల నుంచి 13 వేల మంది పాల్గొన్నారు. అరవై వరకు చార్టెర్ బస్సులను వినియోగించారు. ఆ సమావేశానికి వచ్చిన ప్రవాసులకు అభినందనలూ తెలిపిని ప్రధాని.. ప్రతి ప్రవాసుడు భారత్ అమెరికా సంబంధాల్లో ఒక్కో అంబాసిడర్‌గా పని చేస్తున్నారంటూ కితాబిచ్చారు. ప్రపంచానికి AI అంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అని.. ఇక్కడ మాత్రం అమెరికా ఇండియా అని వ్యాఖ్యానించారు. ప్రవాస భారతీయులు ఏ నేల మీద ఉన్నా ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి తీవ్రంగా శ్రమిస్తారని.. అదే భారతీయులకు ప్రపంచవ్యాప్త గౌరవానికి కారణమని మోదీ వ్యాఖ్యానించారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ డెలావర్‌లోని ఇంటికి మోదీని ఆహ్వానించిన ఘటనపై స్పందించిన ప్రధాని.. అది 140 కోట్ల మంది భారతీయుల పట్ల బైడెన్‌కు ఉన్న గౌరవాభిమానాలకు నిదర్శనం అన్నారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యంగా పెట్టుకుందన్న మోదీ.. అందుకు తగిన విధంగా నిర్ణయాలు సాగుతున్నాయన్నారు. 2036 ఒలింపిక్స్ భారత్‌లో నిర్వహించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు.
పుష్ప అంటే ప్లవర్ అనుకుంటివా... ప్రగతి: మోదీ
ఈ కార్యక్రమంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులను 117 మంది కళాకారులు స్వాగతం పలికారు. వివిధ దేశాలకు చెందిన 382 మంది ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో జరిగిన ప్రదర్శనల్లో భాగం అయ్యారు. ప్రముఖ తెలుగు సంగీత దర్శకుడు దేవీ శ్రీప్రసాద్ పుష్పలోని శ్రీవల్లి పాటతో అలరించారు. పుష్ప అనే మాటకు కూడా మోదీ సరికొత్త అర్థం చెప్పారు. పుష్పలోని ఇంగ్లిష్ లెటర్స్‌తో పీ అంటే ప్రోగ్రెసివ్ ఇండియా యూ అంటే అన్ స్టాపబుల్ ఇండియా, S అంటే స్పిరిచువల్ ఇండియా H అంటే హ్యమానిటీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, P అంటే ప్రోస్పరస్ ఇండియా అని విడమరిచ చెప్పారు. ఇందులోని ఐదు రేకులు ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా ఇండియాను మారుస్తాయన్నారు మోదీ.
Also Read: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 వస్తువుల రేట్లు మారబోతున్నాయ్- బీ అలెర్ట్