అన్వేషించండి

GST Rates: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 వస్తువుల రేట్లు మారబోతున్నాయ్‌- బీ అలెర్ట్‌

Gst Slabs Rationalisation: జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించాలని ప్రజలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ వారంలో జరిగే సమావేశంలో దీనిపై ఒక పెద్ద అప్‌డేట్ రావచ్చు.

GST Councle Meeting Sept 2024: పరోక్ష పన్నుల్లో, అంటే జీఎస్టీ (Goods and Services Tax) రేట్లలో మార్పు కోసం ప్రజలు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ప్రజలే కాదు, దేశంలోని పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా సుదీర్ఘంగా నిరీక్షిస్తున్నారు. ఆ సుదీర్ఘ నిరీక్షణ అతి త్వరలో ముగిసే అవకాశం ఉందని తెలుస్తోంది. రేపటి నుంచి మంత్రుల బృందం సమావేశం జరుగుతుంది, జీఎస్‌టీ రేట్లను హేతుబద్ధీకరించే అంశం ఆ భేటీలో చర్చకు రానుంది.

మంగళవారం నుంచి సమావేశం
మంత్రుల బృందం సమావేశం రేపు (మంగళవారం, 24 సెప్టెంబర్ 2024‌) ప్రారంభమై సెప్టెంబర్ 25 ‍‌(బుధవారం) వరకు కొనసాగనుంది. ఈసారి రెండు రోజులు జరిగే మినిస్టర్స్‌ భేటీకి గోవా వేదికకానుంది. సామ్రాట్ చౌదరి నేతృత్వంలో , GST రేట్లను హేతుబద్ధీకరించడంపై నిర్ణయం తీసుకోవడానికి GoM సమావేశం అవుతుంది.

ప్రస్తుతం అమలులో 4 పన్ను శ్లాబులు
జీఎస్టీ శ్లాబులు మార్చాలని, రేట్లను హేతుబద్ధీకరించాలని దేశంలోని వ్యాపార & పారిశ్రామిక వర్గాల నుంచి చాలా కాలంగా డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం జీఎస్టీ కింద నాలుగు పన్ను శ్లాబులు అమలులో ఉన్నాయి. అవి... 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం. కొన్ని లగ్జరీ, ప్రమాదకర వస్తువులపై ప్రత్యేక సెస్ కూడా విధిస్తున్నారు. జీఎస్టీ శ్లాబుల సంఖ్యను 4 నుంచి 3కు తగ్గించాలన్న డిమాండ్‌ గట్టిగానే వినిపిస్తోంది. 

పరోక్ష పన్నుల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ అనేది అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. ఈ నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్ 54వ సమావేశం జరిగింది. జీఎస్టీ రేట్లను హేతుబద్ధీకరించే విషయంపై మంగళవారం నుంచి జరిగే GoM భేటీలో నిర్ణయం తీసుకోవాలని ఈ నెల ప్రారంభంలో జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో డెసిషన్‌ తీసుకున్నారు. జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణ కోసం ఏర్పాటైన మంత్రుల బృందం గత కౌన్సిల్ సమావేశంలో రెండు రిపోర్టులను సమర్పించింది.

Also Read: ఈ బార్బర్‌ 400 లగ్జరీ కార్లకు ఓనర్‌ - విధి చేసిన విచిత్రం ఇది

చాలా వస్తువులపై పన్ను మారుతుంది!
గోవాలో జరగనున్న మంత్రుల బృందం సమావేశంలో అంశాల వారీగా రేట్లను సమీక్షిస్తారని సమాచారం. ఈ సమీక్ష పరిధిలోకి 70 నుంచి 100 వస్తువులు/సేవలు వస్తాయి. సమీక్ష తర్వాత, ఆ వస్తువులు/సేవల్లో కొన్నింటిపై పన్ను రేట్లు పెరగొచ్చు, కొన్నింటిపై రేట్లు తగ్గొచ్చు. ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులు, సేవలపై మార్పు పెద్దగా ప్రభావం పడకుండా ఉండేలా మంత్రుల బృందం దృష్టి పెడుతుంది. GST రేట్లు తగ్గినా లేదా పెరిగినా.. సంబంధిత వస్తువుల మార్కెట్ ధరపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

నవంబర్‌లో జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశం
ఈ మంత్రుల బృందం భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దానిని టేబుల్‌పైకి తీసుకువస్తారు. GST రేట్లలో మార్పులపై ఫైనల్‌ నిర్ణయం GST కౌన్సిల్ తీసుకుంటుంది. జీఎస్టీ కౌన్సిల్ తదుపరి (55వ) సమావేశం నవంబర్ నెలలో జరుగుతుంది. జీఎస్టీ కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ నేతృత్వం వహిస్తారు. 

మరో ఆసక్తికర కథనం: రూ.200 పైగా పెరిగిన గోల్డ్, కూల్‌గా సిల్వర్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
జగన్ వెంట పడుతున్నా కదలని ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు - పార్టీ కోలుకునే చాన్స్ లేదా ?
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఈ 12న ఆ జిల్లాల్లో వర్షాలతో అలర్ట్ - తెలంగాణలో వణికిస్తున్న చలి
Mohan Babu Attack on Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
మోహన్ బాబు దాడిలో గాయపడ్డ జర్నలిస్టుకు సర్జరీ పూర్తి, డాక్టర్లు ఏమన్నారంటే..
Rammohan Naidu: 2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
2026 జూన్‌ నాటికి భోగాపురం విమానాశ్రయం సిద్ధం: కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు
Tripti Dimri : ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
ఇన్​స్టాలో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన త్రిప్తి దిమ్రి.. అది జస్ట్ క్యారెక్టర్​ మాత్రమే అంటోన్న యానిమల్ బ్యూటీ
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Embed widget