News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Songs Copy Right: అక్కడ పాటలు పెడితే కాపీరైట్‌ ఉల్లంఘన కిందకు రాదు - కేంద్రం స్పష్టత

పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్లలో సినిమా పాటలను పెట్టి డ్యాన్సులు వంటివి చేయడం కాపీరైట్‌ ఉల్లంఘన కింద రాదు అంటూ స్పష్టం చేసింది.

FOLLOW US: 
Share:

మారుతున్న సమాజ పోకడలకు తగినట్లుగానే ఇప్పుడు పెళ్లిళ్లు, వేడుకలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే వారి అభిరుచికి తగినట్లుగానే కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే కొంతకాలం క్రితం పెళ్లి వేడుకల్లో సినిమా పాటలు పెట్టడం గురించి రకరకాల వాదనలు వ్యక్తం అయ్యాయి. దాని గురించి కొందరు అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.

తాజాగా దాని గురించి కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. పెళ్లి వేడుకలు, ఇతర ఫంక్షన్లలో సినిమా పాటలను పెట్టి డ్యాన్సులు వంటివి చేయడం కాపీరైట్‌ ఉల్లంఘన కింద రాదు అంటూ స్పష్టం చేసింది. దీని గురించి ఏ విధమైన చట్టపరమైన చర్యలు తీసుకోలేరని వివరించింది. కొద్ది రోజుల క్రితం పెళ్లి వేడుకల్లో హిందీ పాటలు ప్రదర్శించాలంటే కాపీరైట్‌ సొసైటీలు పన్ను వసూలు చేయడంతో కొందరు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు.              

దాంతో కేంద్రం ఈ ఆదేశాలు జారీ చేసింది.  సెక్షన్‌ 52 ప్రకారం నిబంధనలకు విరుద్దంగా వివాహ కార్యక్రమాల్లో సినిమా పాటలను ప్లే చేసి కాపీరైట్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కొన్ని స్వచ్ఛంధ సంస్థలు పన్ను వసూలు చేయడం మొదలు పెట్టాయి. దీని పై సాధారణ ప్రజలు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌, ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌ కి చాలా ఫిర్యాదులు వచ్చాయని కేంద్రం పేర్కొంది.

అయితే కాపీ రైట్‌ చట్టంలోని సెక్షన్‌ 52 కాపీ రైట్‌ ఉల్లంఘన కిందకు రాని కొన్ని యాక్షన్స్‌ తో ఉంటుందని పేర్కొంది. సెక్షన్‌ 52 (1)(జెడ్‌ ఏ) ప్రకారం ఇది ప్రత్యేకంగా ఏదైనా పెళ్లి వేడుక, మత పరమైన వేడుక లేక ఇతర వేడుకల్లో సినిమా పాటలు పెద్ద సౌండ్లతో పెట్టడం వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించినట్లు కాదని స్పష్టతనిచ్చింది. వీటిని దృష్టిలో ఉంచుకుని.. సెక్షన్ 52 (1) (za)కి విరుద్ధంగా ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా కాపీరైట్ సొసైటీలకు ఆదేశాలు ఇచ్చాం అని DPIIT తెలిపింది.

అసలు కాపీ రైట్ చట్టం అంటే ఏమిటి!

కాపీ రైట్ చట్టం ప్రకారం ఏదైనా ఒక రచన కానీ, ఒక పాటను కానీ దానిని తిరిగి రూపొందించడమో, లేదా ఇతర అవసరాలకు ఉపయోగించడానికి అనువాదం చేయడానికో లేక ఇతర అవసరాలకు వాడుకోవడానికో సంబంధించిన హక్కులన్నీ కూడా కేవలం దానిని రూపొందించిన యజామానికి మాత్రమే ఉంటాయి. దీనిని కాపీరైట్‌ చట్టం అంటారు. దీని వలన అసలు దానిని రూపొందించిన వారు దానిని ఎవరు పడితే వారు వాడుకోకుండాను చూసుకోవచ్చు. అంతేకాకుండా వారికి అవసరమైతే దాని ద్వారా ధనార్జన కూడా చేయవచ్చు.

అయితే ఇ చట్టంలో కూడా కొన్ని లొసుగులు ఉన్నాయి. యజమానికి కాపీరైట్‌ కి ఇంతకాలామని రక్షణ పరిమితిని ఇస్తారు. అందులో దానికి సుమారు యజమాని వయసుకి అదనంగా కాపీ రైట్‌ ఉంటుంది. అంటే ఒకవేళ అసలు యజమానులుఉన్న లేకపోయినప్పటికీ కూడా తరువాత, అదనంగా 60 సంవత్సరాల వరకు మాత్రమే కాపీరైట్ అమల్లో ఉంటుంది. అప్పటి వరకు పూర్తి హక్కులను దాని యజమానుల వారసులు పొందవచ్చు.

Published at : 27 Jul 2023 08:54 PM (IST) Tags: songs Union Govt wedding ceremonies copyright claims

ఇవి కూడా చూడండి

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, రెండు తెగల మధ్య కాల్పులు - 13 మంది మృతి

Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ అలజడి, రెండు తెగల మధ్య కాల్పులు - 13 మంది మృతి

Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?

Mizoram Election Results 2023: ఒకప్పుడు ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్, ఇప్పుడు మిజోరం సీఎం - ఎవరీ లల్దుహోమ?

Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM

Mizoram Election Results 2023: మిజోరంలో బీజేపీ మిత్రపక్ష పార్టీ MNFకి షాక్, మెజార్టీ సాధించిన ZPM

Election Results 2023: కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది, ఇప్పటికైనా మేలుకుంటే మంచిది - కుండ బద్దలు కొట్టిన మమతా

Election Results 2023: కాంగ్రెస్ అందుకే ఓడిపోయింది, ఇప్పటికైనా మేలుకుంటే మంచిది - కుండ బద్దలు కొట్టిన మమతా

Parliament Winter Session: ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి, మీ ఆక్రోశాన్ని చూపించకండి - ప్రతిపక్షాలకు ప్రధాని ఉపదేశం

Parliament Winter Session: ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోండి, మీ ఆక్రోశాన్ని చూపించకండి - ప్రతిపక్షాలకు ప్రధాని ఉపదేశం

టాప్ స్టోరీస్

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

BRS Party News: ఇక తెలంగాణ భవన్ కేంద్రంగా బీఆర్ఎస్ పాలిటిక్స్: ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచనలు

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్
×