అన్వేషించండి

Javeria Khanum: పాకిస్తాన్ పోరీతో బెంగాల్ కుర్రాడి పెళ్లి, ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన పెళ్లికూతురు

Pakistan Women: తను ప్రేమించిన యువకుడి కోసం పాకిస్తాన్‌కు చెందిన యువతి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియాకు వచ్చింది. ఆమెకు కాబోయే భర్త, మామ ఘన స్వాగతం పలికారు.

Kolkata Men Pakistan Women Love: ప్రేమించిన వ్యక్తి కోసం రాజస్థాన్ (Rajasthan Women) నుంచి అంజూ (Anju Nasrullah) వివాహిత పాకిస్తాన్ వెళ్లిన సంగతి గుర్తుంది కదా. సరిగ్గా అలాంటి ఘటనే ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. అయితే ఈసారి బెంగాల్ అబ్బాయి.. పాకిస్తాన్ అమ్మాయి (Pakistan Women). తను ప్రేమించిన యువకుడి కోసం పాకిస్తాన్‌కు చెందిన యువతి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇండియాకు వచ్చింది.

వివరాలు.. పాకిస్తాన్‌(Pakistan Women)లోని కరాచీకి చెందిన జవేరియా ఖానుమ్ (Javeria Khanum), పశ్చిమ బెంగాల్‌ (West Bengal) కోల్‌కతాకు చెందిన సమీర్ ఖాన్ (Sameer Khan) 2018 నుంచి ప్రేమించుకుంటున్నారు. సమీర్ జర్మనీలో చదుకుంటున్న రోజుల్లో ఒక సారి ఇండియాకు వచ్చాడు. తన తల్లి ఫోన్‌లో జావేరియా ఫొటో చూసి ఇష్టపడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆ విధంగా ఈ లవ్ స్టోరీ ప్రారంభమైంది.

సమీర్ ఖాన్‌ను పెళ్లి చేసుకోవడానికి జవేరియా ఖానమ్‌ మంగళవారం ఇండియాలో అడుగుపెట్టింది. భారత ప్రభుత్వం ఆమెకు 45 రోజుల వీసా మంజూరు చేసింది. వాఘా సరిహద్దు (Wagah Border) మీదుగా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమెకు కాబోయే భర్త సమీర్, కాబోయే మామ అహ్మద్ కమల్ ఖాన్, యూసఫ్‌ జాయ్ డప్పులు, బాణ సంచాతో ఘన స్వాగతం పలికారు.

కోవిడ్ మహమ్మారి వారి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అంతే కాదు ఆమె వీసా అంతకు ముందు రెండుసార్లు తిరస్కరణకు గురైంది. జవేరియా ఇండియా వచ్చిన తర్వాత ఈ జంట మీడియాతో ముచ్చటించారు. భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు చెప్పారు. ప్రేమ స్వచ్ఛంగా ఉన్నప్పుడు సరిహద్దులు పట్టింపు లేదని సమీర్ అన్నారు.

వచ్చే ఏడాది జనవరిలో సమీర్, జవేరియా వివాహం జరగనుంది, ఆ తర్వాత ఆమె దీర్ఘకాలిక వీసా కోసం దరఖాస్తు చేసుకోనుంది. ప్రస్తుతం ఆమెకు 45 రోజుల వీసా మంజూరైంది. తాను ఇండియాలో అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉన్నానని, ఇక్కడ చాలా ప్రేమను పొందానని, జనవరి మొదటి వారంలో వివాహం వైభవంగా జరుగుతుందని జవేరియా చెప్పారు. ఇది చాలా సంతోషకరమైన విషయం అని, ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారని జవేరియా తెలిపారు. ఐదేళ్ల తర్వాత నాకు వచ్చిందంటే నమ్మలేకపోతున్నానంటూ తన ఆనందాన్ని వెల్లడించింది. 

జావేరియా భారతదేశానికి రావడానికి, వీసా మంజూరు అవడానికి పాకిస్తాన్‌కు చెందిన జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త మక్బూల్ అహ్మద్ వసీ సహాయం చేశాడు. గతంలో ఆయన చాలా మంది పాకిస్థానీ వధువులు వీసాలు పొందడంలో సాయం చేశారు.  జవేరియాతో తన వివాహానికి ఆఫ్రికా, స్పెయిన్, యునైటెడ్ స్టేట్స్, ఇతర దేశాల నుంచి స్నేహితులు హాజరయ్యే అవకాశం ఉందని సమీర్ తెలిపారు. 

ఇండియాకు తిరిగి వచ్చిన అంజూ 
రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ జులై నెలలో తన భర్త, ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి తన ప్రేమికుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్థాన్‌ కు వెళ్లింది. అక్కడ ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని అప్పర్ దిర్ జిల్లాలో తిరుగుతూ ప్రియుడితో ఎంజాయ్ చేసింది. గత జులై 25న అంజు వివాహం చేసుకున్నారు. దానికి ముందు ఆమె హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారి ఫాతిమాగా పేరు మార్చుకున్నారు. 

కొద్ది కాలంగా అంజూ తన పిల్లలపై బెంగ పెట్టింది. వారిని చూసి పలకరించి వెళ్లేందుకు భారత  గడ్డపై నవంబర్ చివరి వారంలో అడుగుపెట్టింది. ఆమె మంగళవారం అర్థరాత్రి మొహానికి ముసుగు వేసుకుని అట్టారీ-వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించింది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి, 14 మందికి అస్వస్థత 
TG High Court: మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
మాగనూర్ కల్తీ ఆహార ఘటనపై హైకోర్టు ఆగ్రహం - ప్రభుత్వానికి సీరియస్‌నెస్‌ లేదని ఆక్షేపణ 
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Andhra Adani Issue: జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
జగన్‌తో పాటు షర్మిలదీ అదే సవాల్ - చంద్రబాబు ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు ?
Pawan Kalyan Met With Modi:  ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం- చర్చించిన అంశాలు ఇవే
Brahmamudi Maanas Nagulapalli: కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
కొడుక్కి రామ్ చరణ్ మూవీ పేరు పెట్టిన 'బ్రహ్మముడి' మానస్.. ఫొటోస్ చూశారా!
Narayanpet News Today: నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా మాగనూర్‌లో 144 సెక్షన్- ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ముందస్తు అరెస్టు
Embed widget