India-China Border: భారత్- చైనా సరిహద్దులో 18 మంది మిస్సింగ్- ఒకరు మృతి!
India-China Border: భారత్- చైనా సరిహద్దులో కొంతమంది కార్మికులు మిస్ అయ్యారు.
India-China Border: భారత్- చైనా సరిహద్దులో 18 మంది కార్మికులు అదృశ్యం కావడం కలకలం రేపింది. మరొకరి మృతదేహం లభ్యమైంది. వీరంతా అరుణాచల్‌ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లారు.
A search operation has been launched in Arunachal Pradesh's remote Kurung Kumey district, not very far from the Line of Actual Control with China, to find a group of 19 road construction workers who went missing two weeks back from a border road construction site in Damin circle. pic.twitter.com/mHhsWQUU8r
— Swati Subhedar (@swatiSubhedar) July 19, 2022
ఏం జరిగింది?
ఈ 19 మంది కార్మికులు 14 రోజులుగా కనిపించడం లేదని సమాచారం. అయితే ఇందులో ఒక కార్మికుడి మృతదేహం మాత్రం ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద కనిపించింది. అయితే మిగిలిన కార్మికులు ఏమయ్యారనేది ప్రశ్నార్థకమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాజధాని ఇటానగర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఆచూకీ లేని కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే కార్మికులు అదృశ్యమయ్యారు.
ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్టర్ కార్మికులకు లీవ్ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో వాళ్లు చెప్పకుండా ఇళ్లకు వెళ్లారేమోననే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చర్చలు
మరోవైపు భారత్- చైనా మధ్య 16వ రౌండ్ సైనిక చర్చలు ముగిశాయి. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతను తగ్గించేందుకు, బలగాల ఉపసంహరణకు ఇరువర్గాలు అంగీకరించినట్టు సమాచారం. హాట్‌స్ప్రింగ్స్ వద్ద ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని, కమాండర్ స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారని తెలుస్తోంది. భారత్ వైపు ఉన్న చుషులు-మోల్డో సరిహద్దు వద్ద ఈ చర్చలు జరిగాయి. 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఏ సేన్‌గుప్తా భారత్ తరపున చర్చలో పాల్గొన్నారు. చాన్నాళ్ల క్రితమే ఈ చర్చలు ఆగిపోయాయి.
అయితే ఈ వివాదం ఇంకా ముదరకముందే ఇలాంటి సంప్రదింపులు కొనసాగించటం అవసరం అని భావించిన విదేశాంగ మంత్రి జైశంకర్, చర్చలు తిరిగి ప్రారంభమయ్యేలా చొరవ చూపించారు. గత నెల చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో భేటీ అయ్యారు జైశంకర్. జీ-20 సదస్సులో పాల్గొన్న సందర్భంలోనే ఎల్‌ఏసీ వివాదంపై చర్చించారు.
Also Read: Nupur Sharma Row: నుపుర్ శర్మ వీడియో చూసినందుకు 6 సార్లు కత్తితో పొడిచారు!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15,528 కరోనా కేసులు- 25 మంది మృతి