By: ABP Desam | Updated at : 19 Jul 2022 11:24 AM (IST)
Edited By: Murali Krishna
నుపుర్ శర్మ వీడియో చూసినందుకు 6 సార్లు కత్తితో పొడిచారు!
Nupur Sharma Row: బిహార్‌లో దారుణ ఘటన జరిగింది. మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ వీడియో చూసిన వ్యక్తిని కత్తితో పొడిచేశారు దుండగులు. సీతామర్హిలో ఈ ఘటన జరిగింది.
దారుణం
సీతామర్హి జిల్లాలో నుపుర్ శర్మ వీడియోను చూసినందుకు అంకిత్ ఝా అనే యువకుడిని కొందరు వ్యక్తులు కత్తితో పొడిచారు. అయితే నాలుగు రోజుల క్రితం జరిగిన దాడికి వ్యక్తిగత శత్రుత్వమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసినా అందులో నుపుర్ శర్మ ప్రస్తావన లేదు.
“Ankit Kumar Jha, was stabbed six times for supporting Nupur Sharma in Sitamarhi, Bihar by a man identified as Gulab Rabbani”. Reportedly, Bihar Police only registered the complaint after Nupur Sharma’s name was removed from it. pic.twitter.com/yM6K0agpsb
— Manika Shandilya 🇮🇳 (@RoseTint4) July 19, 2022
ఇద్దరు అరెస్ట్
ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. బహెరా గ్రామానికి చెందిన అంకిత్ ఝా ప్రస్తుతం దర్భంగాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ జరిగింది
అంకిత్ ఝా అనే వ్యక్తి తన పాన్ షాప్‌లో మొబైల్ ఫోన్‌లో నుపుర్ శర్మ వీడియోను చూస్తుండగా మహ్మద్ బిలాల్ సహా నలుగురు వ్యక్తులు అతని వద్దకు వచ్చారు. తాను నుపుర్ శర్మ వీడియోను చూస్తున్నందున వారికి తనపై కోపం వచ్చిందని అంకిత్ చెప్పాడు. అంకిత్‌ను నడుముపై కత్తితో ఆరుసార్లు పొడిచారు.
అయితే ఇద్దరు స్నేహితులు పాన్ షాపులో పాన్ తింటుండగా దుకాణంలో విక్రయించే గంజాయిపై వారి మధ్య వాగ్వాదం జరిగిందని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు. ఇది కత్తిపోట్లకు దారి తీసిందని డీఎస్పీ అన్నారు. అయితే అంకిత్‌పై జరిగిన దాడి పేరుతో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 15,528 కరోనా కేసులు- 25 మంది మృతి
Also Read: UGC on Ad-hoc Teachers : తాత్కాలిక ఉపాధ్యాయులను పర్మినెంట్ చేసే ప్రతిపాదన లేదు, తేల్చేసిన కేంద్రం
Delhi liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్ వ్యాపారి పేరు - సీబీఐ ఎఫ్ఐఆర్లో కీలక విషయాలు
రామాంతపూర్ ఘటనతో ఇంటర్‌బోర్డు అలర్ట్- కాలేజీలకు కీలక ఆదేశాలు
Make India No 1: మిస్డ్ కాల్ ఇవ్వండి, ఇండియాను నంబర్ వన్ చేయండి - ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
Mlc Kavitha On Bilkis Bano Case : బిల్కిస్ బానో కేసులో దోషుల విడుదలపై జోక్యం చేసుకోండి, సీజేఐకు ఎమ్మెల్సీ కవిత లేఖ
Karthikeya 2: కార్తికేయ-2లో హీరో పాముని ఎలా కంట్రోల్ చేశాడు? జూలింగ్వలిజంతో ఇది సాధ్యమా?
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!