By: ABP Desam | Updated at : 15 Dec 2021 09:56 PM (IST)
Edited By: Sai Anand Madasu
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ మెల్లగా విస్తరిస్తోంది. కొత్తగా తమిళనాడులో ఒమిక్రాన్ కేసు నమోదైనట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి వెల్లడించారు. బంగాల్లోని ముర్షిబాద్ జిల్లాలోనూ తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఏడేళ్ల బాలుడికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు అధికారులు తెలిపారు. బాలుడు అబుదాబి నుంచి హైదరాబాద్‌కు, అక్కడి నుంచి బంగాల్‌కు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య.. 69కి చేరింది. తెలంగాణలో 3 కేసులు నమోదవ్వగా.. ఏపీలో ఒక ఒమిక్రాన్ కేసు నమోదైంది.
దేశంలో మెుత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 69కి చేరగా.. ఒక్క మహారాష్ట్రలోనే 32 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, బంగాల్, ఛండీగఢ్, ఢిల్లీ లోనూ ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు రాజస్థాన్‌లో ఒమిక్రాన్ బారినపడిన వారంతా కోలుకుని ఇళ్లకు వెళ్లినట్లు కేంద్రం వివరించింది.
COVID19 | Maharashtra reports 925 new cases & 10 deaths today; Active caseload at 6,467
4 more patients have been found to be infected with Omicron in the state, taking the tally to 32. pic.twitter.com/zbmMYMcksL— ANI (@ANI) December 15, 2021
మరోవైపు ఒమిక్రాన్ పై కేంద్రం హెచ్చరించింది. అప్రమత్తంగా ఉండాలి చెబుతోంది. మహారాష్ట్ర, రాజస్థాన్ , కర్ణాటక, గుజరాత్, కేరళ, ఆంధ్రప్రదేశ్, బంగాల్, తమిళనాడు, ఢిల్లీ, చండీగఢ్‌లో, బంగాల్ లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు తెలిపింది. కరోనా నిబంధనలు పాటించాలని టీకాలు వేసుకోవాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు ఒమిక్రాన్ వేరియంట్ విస్తరించిందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కొత్తగా 6,984 కోరనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,47,10,628కి పెరిగింది. యాక్టివ్ కేసుల సంఖ్య 87,562కు చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మొత్తం మరణాల సంఖ్య 4,76,135కు చేరింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 0.25గా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యల్పం. రికవరీ రేటు 98.38 శాతంగా ఉంది. 2020 మార్చి నుంచి ఇదే అత్యధికం.
Also Read: Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి
Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Maharashtra Political Crisis: 'కాస్త పంపించండి, ఓటేసి వస్తాం'- సుప్రీంలో పిటిషన్ వేసిన ఆ ఇద్దరు
Udaipur Murder Case: 'ఉదయ్‌పుర్' హంతకులను వెంటాడి పట్టుకున్న పోలీసులు- వీడియో చూశారా?
Intelligence Alert: ఆ 2 రాష్ట్రాలకు భారీగా బలగాలు- అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా హెచ్చరిక
Vice President Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల- ఆగస్టు 6న ఫలితాలు
Viral Video: ఏం దూకినవ్, హార్ట్ బీట్ పెంచేసినవ్ లే- 70 ఏళ్ల బామ్మ జంప్!
Hero Passion XTEC: కొత్త ప్యాషన్ వచ్చేసింది - రూ.లక్ష లోపు బెస్ట్ బైక్!
SC Welfare DD On Warden : బదిలీ కోరిందని మహిళా వార్డెన్ పై దురుసు ప్రవర్తన | ABP Desam
Perni Nani Son : బందర్ వైఎస్ఆర్సీపీ టిక్కెట్ ఈ సారి కిట్టూకే - తేల్చేసిన కొడాలి నాని !
Samsung New Soundbar Lineup: ఈ సౌండ్ బార్ల కంటే టీవీలే తక్కువ రేటు - కానీ ఫీచర్లు మాత్రం అదుర్స్!