No Service Charge : సర్వీస్ చార్జ్ వసూలు చట్ట విరుద్దం - ఇక బిల్లు చెల్లించేటప్పుడు ఓ సారి చూసుకోండి !
పన్నులకు తోడు చాలా చోట్ల హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు సర్వీస్ చార్జ్ వసూలు చేస్తూంటాయి. అలా వసూలు చేయకూడదని కేంద్రం తాజాగా ఆదేశాలిచ్చింది.
No Service Charge : హోటల్‌కి వెళ్తే స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ కలిపి బిల్లు వస్తుంది. చాలా చోట్ల అందులో సర్వీస్ చార్జ్ అనికూడా ఉంటుంది. అదో రకమైన పన్ను అనుకుని అందరూ కట్టేసి వెళ్లిపోతూంటారు. కానీ సర్వీస్ చార్జ్ అనేది నిర్బంధం కాదు. ఇచ్చే వాళ్ల ఇష్టం. కానీ బిల్లులో కలిపి ఇస్తూండే సరికి నిజంగానే కట్టాలేమో అనుకుంటున్నారు. నిజానికి అది నిర్బంధం కాదు. అయితే హోటల్స్ ఇతర వ్యాపార సంస్థలు ఈ వసూళ్లను ఆపడం లేదు.
ఈ - మెబిలిటీ అంటే ఈట్ మొబిలిటి ! ఆనంద్ మహింద్రా కొత్త ఇన్వెంటరీ
అందుకే కేంద్ర ప్రభుత్వం సర్వీస్ చార్జీలను రద్దు చేస్తున్నట్లు సోమవారం ఓ కీలక ప్రకటన చేసింది. అంతేకాకుండా ఇకపై ఏ హోటల్ గానీ, రెస్టారెంట్ గానీ సర్వీస్ చార్జీలను వసూలు చేయరాదంటూ కఠిన ఆదేశాలు జారీ చేసింది కేంద్రం. ఏ బిల్లుకు అయినా జీఎస్టీ పన్ను వసూలు చేస్తున్న నేపథ్యంలో సర్వీస్ చార్జీ అనే మాటే ఉత్పన్నం కావొద్దన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. వస్తువులు, సేవలపై జీఎస్టీ పేరిట పన్ను వేస్తున్నప్పుడు ఇక హోటళ్లు, రెస్టారెంట్లు సర్వీస్ చార్జీల పేరిట అదనపు పన్ను వేస్తున్న వైనంపై దృష్టి సారించిన కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు సర్వీస్ చార్జీలు వసూలు చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది.
'ధూమ్' రేంజ్‌లో స్కూల్‌లో దొంగతనం- దమ్ముంటే పట్టుకోవాలని సవాల్!
ఇక ఎప్పుడైనా హోటల్‌కు వెళితే.. సర్వీస్ చార్జీలు కట్టకండి.. అడిగితే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ గైడ్ లైన్స్ జారీ చేసింది. ఎవ రైనా ఇలాంటి సర్వీస్ చార్జి బిల్లులో కనిపిస్తే.. దాన్ని తీసేయాలని హోటల్‌ని కోరవచ్చు. తీసేయకపోతే.. జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్‌కు ఫిర్యాదు చే్స్తే తదుపరి చర్యలు తీసుకుంటారు.
రబ్బర్‌స్టాంప్‌గా ఉండిపోనని మాటివ్వాలి, ద్రౌపది ముర్ముకి యశ్వంత్ సిన్హా ఛాలెంజ్
ఇటీవల ఐఆర్సీటీసీ రైలులో టీ ఇరవై రూపాయలు అయితే.. యాభై రూపాయల సర్వీస్ చార్జ్ వసూలు చేయడం వివాదాస్పదమయింది. ఈ అంశంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ఈ సర్వీస్ చార్జ్ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఎవరైనా ఇష్టపూర్వకంగా ఇస్తే సరే బలవంతంగా బిల్లులో కలిపి వసూలు చేయవద్దని కేంద్రం స్పష్టం చేసింది.