New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేశారు. పూజతో ప్రారంభమైన కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రధాని వెంట ఉన్నారు. పూజ తర్వాత, ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ బిర్లా కొత్త లోక్‌సభలోకి ప్రవేశించారు. అక్కడ స్పీకర్ కుర్చీకి సమీపంలో చారిత్రాత్మక 'సెంగోల్'ని మోదీ ఏర్పాటు చేశారు. అనంతరం, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి గుర్తుగా ఫలకాన్ని ప్రధాని ఆవిష్కరించారు.
#WATCH | PM Modi unveils the plaque to mark the inauguration of the new Parliament building pic.twitter.com/quaSAS7xq6
— ANI (@ANI) May 28, 2023
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముందు లోక్‌సభ స్పీకర్ ఛైర్ వద్ద 'సెంగోల్' ప్రతిష్ఠించినప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పీఠాధిపతులు చారిత్రాత్మకమైన 'సెంగోల్'ను అందజేయగా, కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ స్పీకర్ కుర్చీ దగ్గర దానిని ఏర్పాటు చేశారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన వేడుకలో ఆయన 'సెంగోల్' ముందు గౌరవ సూచకంగా సాష్టాంగనమస్కారం చేశారు.
కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లోకి చారిత్రాత్మకమైన 'సెంగోల్'ను తీసుకెళ్లారు. ఢిల్లీలోని కొత్త పార్లమెంట్ భవనంలో 'సెంగోల్'ని ఉంచిన తర్వాత, తమిళనాడుకు చెందిన వివిధ పీఠాధిపతులు ఆశీస్సులు అందుకున్నారు.
'సెంగోల్'పై కేంద్రం vs కాంగ్రెస్
లార్డ్ మౌంట్‌బాటన్, సి రాజగోపాలాచారి, జవహర్‌లాల్ నెహ్రూ 'సెంగోల్'ను బ్రిటిష్ వారు భారతదేశానికి అధికార మార్పిడికి చిహ్నంగా ఇచ్చారనేందుకు ఎలాంటి డాక్యుమెంట్ ఆధారాలు లేవని కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ జైరాం రమేష్ శుక్రవారం పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్, మోడీ ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగింది. తమిళనాడులో తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఉత్సవ రాజదండాన్ని ఉపయోగిస్తున్నారని రమేష్ కామెంట్ చేశారు.
జైరామ్ రమేష్ ట్విట్టర్‌లో ఇలా అన్నారు: "వాట్సాప్ విశ్వవిద్యాలయం నుంచి తప్పుడు కథనాలతో కొత్త పార్లమెంటును అపవిత్రం చేయడంలో ఆశ్చర్యం ఉందా? గరిష్ట వాదనలు, కనీస సాక్ష్యాధారాలతో బిజెపి/ఆర్‌ఎస్‌ఎస్ వంచనలు మరోసారి బయటపడ్డాయి." "అప్పటి మద్రాసు ప్రావిన్స్‌లోని ఒక మతపరమైన కార్యక్రమాల కోసం రూపొందించిన, రాజదండం ఆగస్టు 1947లో నెహ్రూకు ఇచ్చారు. మౌంట్‌బాటన్, రాజాజీ, నెహ్రూ ఈ రాజదండాన్ని బ్రిటిష్ వారి అధికారం భారతదేశానికి బదిలీకి చిహ్నంగా చెప్పడానికి సాక్ష్యాలు లేవు. దీనిపై జరుగుతున్న ప్రచారమంతా బోగస్," అని ఆయన రాశారు.
రమేష్ చేసిన ఆరోపణలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ, కాంగ్రెస్ పార్టీ భారతీయ సంప్రదాయాలు, సంస్కృతిని ఎందుకు అంతగా ద్వేషిస్తుంది అని ప్రశ్నించగా, ఈ వ్యాఖ్యలు "అవమానకరమైనవిగా విమర్శించారు.
"భారత స్వాతంత్య్రానికి ప్రతీకగా తమిళనాడుకు చెందిన ఒక పవిత్ర శైవ మఠం పండిట్ నెహ్రూకు పవిత్రమైన సెంగోల్‌ను అందించింది, అయితే దానిని 'వాకింగ్ స్టిక్'గా మ్యూజియంలో భద్రపరించారు," అని హోం మంత్రి వరుస ట్వీట్‌లలో తెలిపారు.
"ఇప్పుడు, కాంగ్రెస్ మరొక అవమానకరమైన అనుమానాన్ని లేవనెత్తింది. పవిత్ర శైవ మఠం అయిన తిరువడుత్తురై స్వయంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో సెంగోల్ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. ఆ చరిత్రను కాంగ్రెస్ బోగస్ అంటోంది! ఇది కాంగ్రెస్ ప్రవర్తనను ప్రతిబింబిస్తుంది! ," అన్నారాయన.