అన్వేషించండి

NEET PG 2022: నీట్ పీజీ- 2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కీలక నిర్ణయం

NEET PG 2022: నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేయాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది.

NEET PG 2022: నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షను వాయిదా వేసేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఈ పరీక్షలను వాయిదా వేస్తే వైద్యులు అందుబాటులోలేని పరిస్థితికి దారి తీస్తుందని అభిప్రాయపడింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం.. వైద్యులు దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

" నీట్ పీజీ- 2022ను వాయిదా వేస్తే గందరగోళం ఏర్పడుతుంది. ఈ పరీక్షల కోసం సిద్ధమవుతున్న అత్యధిక విద్యార్థులపై ప్రభావం పడుతుంది. విద్యార్థుల్లో రెండు కేటగిరీల వారు ఉన్నారు. ఓ వర్గం వాయిదా వేయాలని కోరుతోంది. కానీ ఇలా చేస్తే పరీక్ష కోసం సన్నద్ధమైన 2 లక్షల 6 వేల మంది విద్యార్థులున్న మరో పెద్ద వర్గానికి నష్టం జరుగుతుంది. కరోనా కారణంగా పరీక్షల షెడ్యూల్​ ప్రభావితమైంది. దానిని పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.                                                               "
-సుప్రీం కోర్టు 

వాయిదా కోసం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG), 2022ను వాయిదా వేయాలని కోరుతూ కొందరు వైద్యులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు మే 10న అంగీకరించింది. నీట్​ పీజీ- 2021 కౌన్సెలింగ్​ ఇంకా జరుగుతుందని, అందులో సీటు దక్కని విద్యార్థులు నీట్​-పీజీ 2022కు సన్నద్ధమయ్యేందుకు వీలు కల్పించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా పరీక్ష వాయిదా వేయాలని కొందరు వైద్యుల బృందం సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది. 

Also Read: Nav Sankalp Chintan Shivir: 'ఒక పార్టీ, ఒకే టికెట్‌'పై కాంగ్రెస్ కీలక నిర్ణయం- హాట్‌హాట్‌గా 'చింతన్ శివిర్' సమావేశం

Also Read: PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

RR vs DC Match Highlights IPL 2024: ఆఖరి ఓవర్ లో అదరగొట్టిన ఆవేశ్, దిల్లీపై రాజస్థాన్ విజయంYS Jagan vs Sunitha | YS Viveka Case: ప్రొద్దుటూరు సభలో జగన్ కామెంట్స్ కు వివేకా కుమార్తె కౌంటర్Karimnagar Young Voters Opinion Poll Elections: కరీంనగర్ యువ ఓటర్లు ఏమంటున్నారు? వారి ఓటు ఎవరికి..?YSRCP Varaprasad | Pathapatnam: వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతిపై రెబెల్ తులసీ వరప్రసాద్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Narayanpet News: బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
బిడ్డ సమాధి వద్దే పడుకున్న తండ్రి - కన్నీళ్లు పెట్టించే ఘటన, ఎక్కడంటే?
CM Jagan : చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి పోతాం - నంద్యాల సభలో ఏపీ ప్రజలకు జగన్ విజ్ఞప్తి !
YouTube Videos Delete: ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
ఇండియన్ యూట్యూబర్లకు గూగుల్ షాక్ - ఏకంగా 22 లక్షల వీడియోలు డిలీట్!
TSGENCO Exams: జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
జెన్‌కోలో ఏఈ, కెమిస్ట్‌ నియామక పరీక్షలు వాయిదా - కొత్త షెడ్యూలు ఎప్పుడంటే?
BRS Mews : సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
సైలెంట్‌గా పార్టీ మారిపోక కేసీఆర్‌కు చెప్పేందుకు వెళ్లిన కేకే - అప్పుడేమయిందంటే ?
Suriya 44 Update: క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
క్రేజీ అప్‌డేట్‌ - అప్పుడే మరో స్టార్‌ డైరెక్టర్‌ని లైన్లో పెట్టిన సూర్య, ‌ఆసక్తి పెంచుతున్న పోస్టర్‌‌
Inter Summer Holidays: ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
ఇంటర్ కాలేజీలకు మార్చి 30 నుంచి వేసవి సెలవులు - కళాశాలల రీఓపెనింగ్ ఎప్పుడంటే?
Sivaji Raja: పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
పవన్ కళ్యాణ్ నా ఆఫీస్‌కు వచ్చి గొడవ చేశాడు, అడిగే స్టేజ్ దాటిపోయింది - శివాజీ రాజా
Embed widget