(Source: ECI/ABP News/ABP Majha)
Nav Sankalp Chintan Shivir: 'ఒక పార్టీ, ఒకే టికెట్'పై కాంగ్రెస్ కీలక నిర్ణయం- హాట్‌హాట్‌గా 'చింతన్ శివిర్' సమావేశం
Nav Sankalp Chintan Shivir: 'ఒక పార్టీ ఒకే టికెట్‌పై' కాంగ్రెస్ ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చింతన్ శివిర్ సమావేశాల అనంతరం దీనిపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Nav Sankalp Chintan Shivir: పార్టీలో సంస్థాగత ప్రక్షాళన, కీలక సంస్కరణలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన చింతన్ శివిర్ సమావేశం ప్రారంభమైంది. రాజస్థాన్ ఉదయ్‌పుర్‌లో ఈ సమావేశాలు నిర్వహిస్తోంది. అయితీ ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఒక పార్టీ ఒకే టికెట్ నిబంధనపై ఈ సమావేశంలో ఏకాభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది.
కీలక సంస్కరణ
ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ఈ సమావేశంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన విషయంలో గాంధీ కుటుంబానికి వెసలుబాటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో ఉన్న పదువులు, వయో పరిమితిపైన కూడా తమ ఎజెండాలో కాంగ్రెస్ పార్టీ చర్చించనున్నది.
మరో నిబంధన
కాంగ్రెస్ నేతల బంధువులు పార్టీ కోసం పని చేయకుండా ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు పొందరాదని ఈ సమావేశంలో నిర్ణయించారు. కనీసం ఐదేళ్ళపాటు పార్టీ కోసం పని చేయనివారికి టిక్కెట్లు ఇవ్వరాదని చేసిన ప్రతిపాదనకు కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారని పార్టీ నేత అజయ్ మాకెన్ వెల్లడించారు. ఏదైనా పదవిని నిరంతరాయంగా నిర్వహించే నాయకుడు ఆ పదవి నుంచి వైదొలగాలని, మళ్లీ అదే పదవిని చేపట్టడానికి కనీసం మూడేళ్ళ విరామం ఉండాలన్నారు.
ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా అగ్ర నాయకత్వం తరలివచ్చింది. వీరితో పాటు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్, ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ సహా ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో 400 మంది కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొంటారని అంచనా. భాగస్వాముల్లో అత్యధికులు పార్టీలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదవులు నిర్వహిస్తున్న లేదా గతంలో నిర్వహించినవారు ఉంటారు. అంతేకాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నవారు కూడా సమావేశానికి వచ్చారు.
Also Read: PM Modi: రెండుసార్లు ప్రధానిగా చేశానని సరిపెట్టుకోను- సంతృప్తి పడను: మోదీ
Also Read: Chhattisgarh Helicopter Crash: కుప్పకూలిన హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి