అన్వేషించండి

Navjot Singh Sidhu: పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను ‘బడా భాయ్’అని పిలవడంపై బీజేపీ దాడి.. ఘాటు రిప్లై ఇచ్చిన నవజ్యోత్ సింగ్ సిద్ధు

నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ పాకిస్థాన్ టూర్ పంజాబ్‌ రాజకీయాల్లో కలకలం రేపింది. సిద్ధూపై బీజేపీ తీవ్రస్థాయిలో దాడి చేసింది. దీనిపై పంజాబ్‌ కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఘాటాగా స్పందించారు.

పంజాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను బడాభాయ్‌ అని పిలవడం ఇప్పుడు పంజాబ్‌ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.  దీన్ని భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. బీజేపీ దాడిని కూడా సిద్ధు తన స్టైల్‌లో తిప్పి కొట్టారు. 

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్‌ను సందర్శించారు. గురుదాస్‌పూర్‌లోని డేరా బాబా నానక్‌లోని కర్తార్‌పూర్ కారిడార్ వద్ద ఓ ఘటన చోటు చేసుకుంది. అక్కడ షూట్ చేసిన ఓ వీడియోలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బడా భాయ్‌ అంటూ సంబోధించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో ఇప్పుడు దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. విపక్షాలు సిద్ధ కామెంట్స్‌ను తీవ్ర స్థాయిలో తప్పు బడుతున్నాయి. వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. జాతికి క్షమాపణ చెప్పాలని పట్టుబడుతోంది. 

బీజేపీవాళ్లు చేస్తున్న విమర్శలపై సిద్ధు తన స్టైల్‌లో స్పందించారు. బీజేపీ వాళ్లు సంతోపడినట్టుగాన మాట్లాడుకోనివ్వండీ అంటూ సెటైర్‌లు వేశారు. 

బీజేపీ  సీనియర్ లీడర్‌ అమిత్ మాల్వియా.. నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడిన వీడియోను ట్వీట్ చేస్తూ రాహుల్ గాంధీకి ఇష్టమైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను “బడా భాయ్” అని పిలిచారని తన పోస్టులో రాసుకొచ్చారు. చివరిసారి అతను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ బజ్వాను కౌగిలించుకున్నప్పుడు... అనుభవజ్ఞుడైన అమరీందర్ సింగ్‌ను కాదని సిద్ధూకు పార్టీ బాధ్యతలు అప్పగించడం ఏంటని ఆశ్చర్య వ్యక్తం చేశార. 

బీజేపీ విడుదల చేసిన వీడియోలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తరపున సిద్ధూకు స్వాగతం పలుకుతున్న టైంలో సిద్ధూ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. “మేరా బడా భాయ్ హై.. ఉస్నే బోహోత్ ప్యార్ దియా హై ముజే అంటే అతను నా అన్నయ్య.. నాకు చాలా ప్రేమను ఇచ్చాడు చెప్తూ సిద్దూ చేసిన వ్యాఖ్యలను బీజేపీ ట్వీట్‌ చేసింది. 

బీజేపీ లీడర్ విడుదల చేసిన వీడియో కాస్త వైరల్‌ కావడంతో పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ బిజెపిపై ఎదురుదాడికి దిగారు. “ప్రధాని మోదీ పాకిస్తాన్‌ వెళ్లినప్పుడు అతను 'దేశ్ ప్రేమికుడని... సిద్ధూ వెళ్ళినప్పుడు 'దేశ్ ద్రోహి ఎలా అవుతారని నిలదీశారు. గురునానక్‌ ఫిలాసఫీని అనుసరించే తాము అలా మాట్లాడలేమన్నారు పర్గత్‌ సింగ్.

పంజాబ్‌లో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల్లో బీజేపీతో జతకట్టేందుకు యత్నిస్తున్న పంజాబ్‌ మాజీ సీఎం అమరీందర్‌ సింగ్‌ సిద్ధూపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నవజ్యోత్ సింగ్ సిద్ధూను దేశ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు అమరీందర్‌. సిద్ధూ పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌ కమర్‌ జావేద్‌ బజ్వా, పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌లతో స్నేహం చేస్తున్నారని విమర్శలు చేశారు. అలాంటి వ్యక్తిని పంజాబ్‌ ముఖ్యమంత్రిగా నేను మాత్రం అంగీకరించబోనని అమరీందర్ కామెంట్ చేశారు. 

వస్తున్న విమర్శలపై మీడియాతో మాట్లాడిన సిద్ధు.. కర్తార్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ తిరిగి ప్రారంభించిన ఘతన ఇరు దేశాల ప్రధానమంత్రులకు దక్కుతుందన్నారు. వాళ్లిద్దరి కృషి కారణంగానే ఆ రహదారి తెరుచుకుందన్నారు. పంజాబ్ భవిష్యత్‌ను మార్చాలని కేంద్రం అనుకుంటే సరిహద్దురు ఓపెన్ చేయాలని కోరతానన్నారు సిద్ధు. మొత్తం 2100 కిలోమీటర్లు ఉన్న ముంద్రా పోర్ట్ గుండా ఎందుకు వస్తువులు ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ చేయాలి.. పంజాబ్‌ సరిహద్దులు ఓపెన్ చేస్తే కేవలం 21కిలోమీటర్లు ప్రయాణితే పాకిస్థాన్ చేరుకోవచ్చన్నారు 

Also Read : మా భువనేశ్వరిపై కామెంట్స్ బాధకరం .. విలువలతో పెరిగాం.. ఆ విషయంపై మేం రాజీపడే ప్రసక్తే లేదు: పురంధేశ్వరి

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Lucknow Super Giants vs Chennai Super Kings Highlights | లక్నో ఆల్ రౌండ్ షో.. చెన్నై ఓటమి | ABPBrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2024 CSK vs LSG: లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
లక్నో ఆల్ రౌండ్ షో, చెన్నై ఓటమి - టాప్ 5 హైలైట్స్ ఇవే
Premalu 2 Update: బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
బ్లాక్‌బస్టర్‌ చిత్రం 'ప్రేమలు'కు సీక్వెల్‌ ప్రకటించిన మేకర్స్‌ - రిలీజ్‌పై ఎప్పుడో కూడా చెప్పేశారు
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Best Horror Movies on OTT: సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
సాధారణ అమ్మాయికి సూపర్ పవర్స్ వస్తే? ట్విస్టులతో భయపెట్టే మిస్టీరియస్ హర్రర్ మూవీ ఇది, ఏ ఓటీటీలో అంటే?
T Rajaiah vs Kadiyam: దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, నా మీద పోటీ చెయ్: కడియం శ్రీహరికి రాజయ్య సవాల్
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Blind People Voting: అంధులు ఓటు హక్కు ఎలా వినియోగించుకుంటారు? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది?
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Embed widget