National Herald case: నాలుగోసారి ఈడీ ముందుకు రాహుల్ గాంధీ- దిల్లీలో కాంగ్రెస్ సత్యాగ్రహం
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు విచారణ కోసం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. నాలుగు రోజుల విరామం తర్వాత రాహుల్ గాంధీ ఈడీ ఆఫీసుకు సోమవారం హాజరయ్యారు.
ఈడీ అధికారులు గత వారంలో రాహుల్ గాంధీని వరుసగా 3 రోజులు విచారించారు. 3 రోజుల్లో దాదాపు 30 గంటల పాటు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించింది.
#WATCH | Delhi: Congress leader Rahul Gandhi arrives at the Enforcement Directorate (ED) office, for questioning in the National Herald case. Today is the fourth day of his questioning by the agency. pic.twitter.com/4XHeiqf8Sr
— ANI (@ANI) June 20, 2022
సత్యాగ్రహ దీక్ష
మరోవైపు రాహుల్ గాంధీపై ఈడీ విచారణ, కేంద్రం తెచ్చిన అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ నేతల సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.
Delhi | Congress leaders, including Mallikarjun Kharge, Salman Khurshid, K Suresh, V Narayanasamy and others, hold a 'Satyagraha' at Jantar Mantar against ED summons to Rahul Gandhi and #AgnipathScheme pic.twitter.com/TbTWnanZww
— ANI (@ANI) June 20, 2022
కాంగ్రెస్ నేతలు చేపట్టిన దీక్షకు తరలివస్తోన్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్ వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులతో కేసీ వేణుగోపాల్, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు.
ఈ సత్యాగ్రహ దీక్షలో కాంగ్రెస్ నేతలు, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, కన్నయ్య కుమార్, మల్లిఖార్జున ఖర్గే, జేడీ శీలం, రణదీప్ సుర్జేవాల, కాంగ్రెస్ ఎంపీలు, ఏఐసీసీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలువనుంది.
Also Read: Lightning Strikes in Bihar: పిడుగుపాటుకు 17 మంది మృతి - రూ.4 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం
Also Read: Jammu Kashmir Encounter: కాల్పులతో దద్దరిల్లిన కశ్మీర్- 24 గంటల్లో ఏడుగురు ఉగ్రవాదులు హతం