News
News
X

BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్

BRS Chief KCR :దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేశ పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు.

FOLLOW US: 
Share:

BRS Chief KCR :  భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీ మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేశారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాందేడ్‌ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన 40 గ్రామాల సర్పంచ్‌లు బీఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తోంది.  ఈ సభలో ప్రజల్ని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. ఇన్నేళ్లయినా చాలా గ్రామాల్లో తాగునీరు, సాగు నీరు లేదన్నారు. కరెంట్‌ సదుపాయం లేకుండా వందల గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు.  వనరులు ఉన్నా ప్రభుత్వాల చేతకాని పరిస్థితుల వల్లే ఇది జరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

దేశంలో నాయకత్వ మార్పు రావాలి

మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో నాయకత్వ మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో స్థానిక ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. ఎంత కష్టం, ఆవేదన ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందో ఆలోచించాలన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఉసురు తీసుకోవడం శ్రేయస్కరం కాదన్నారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని నినదించిన పార్టీ దేశంలో బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్నారు.  ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ మహారాష్ట్రకు రోటీ - భేటీ బంధం ఉందన్నారు. నిత్యం తెలంగాణకు వచ్చేవాళ్లంతా అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో రైతు బీమాతో కుటుంబాలకు భరోసా దొరికిందన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినా వారం రోజుల్లో రూ.5 లక్షలు సాయం అందిస్తున్నామన్నారు.  

ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు 

ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం రైతు బంధు కింద రైతన్నలకు అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నామన్నారు.  తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలుచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. తన మాటల్లో నిజం ఉందన్న కేసీఆర్ బీఆర్ఎస్ కండువా భుజాన వేసుకుని పోరాటానికి కదలిరావాలని పిలుపునిచ్చారు. దళితబంధు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌  ప్రభుత్వం రాగానే దేశంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.  

మహారాష్ట్రలో 24 గంటల కరెంటు ఇస్తాం 

మహారాష్ట్రలో ఏటా 5 లక్షల కోట్ల బడ్జెట్‌ పెడుతున్నారు కానీ రైతులకు రూ.10 వేలు ఇవ్వలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. 13 నెలలు రైతులు దిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసినా ప్రధాని మోదీ కనీసం పలకరించలేదని మండిపడ్డారు. దిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే ప్రధానికి చేతులు రాలేదన్నారు. ఫసల్‌ బీమా అంతా జూటా అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కిసాన్‌ సర్కార్‌ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయన్నారు. మహారాష్ట్రలో గులాబీ సర్కార్‌ రాగానే 24 గంటల కరెంటు వస్తుందన్నారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారన్నారు. 

అధికారం ఇస్తే 24 గంటల కరెంటు  

మహారాష్ట్రలో ఏటా 5 లక్షల కోట్ల బడ్జెట్‌ పెడుతున్నారు కానీ రైతులకు రూ.10 వేలు ఇవ్వలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. 13 నెలలు రైతులు దిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసినా ప్రధాని మోదీ కనీసం పలకరించలేదని మండిపడ్డారు. దిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే ప్రధానికి చేతులు రాలేదన్నారు. ఫసల్‌ బీమా అంతా జూటా అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కిసాన్‌ సర్కార్‌ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయన్నారు. మహారాష్ట్రలో గులాబీ సర్కార్‌ రాగానే 24 గంటల కరెంటు వస్తుందన్నారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారన్నారు. దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్న కేసీఆర్‌... కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చన్నారు. బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్‌ ఇస్తామన్నారు.  తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలన్నారు. కిసాన్‌ సర్కార్‌ రావాలని కేసీఆర్ అన్నారు.  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  భారత్‌ పేద దేశం ఎంతమాత్రం కాదన్న కేసీఆర్ భారత్‌ అమెరికా కంటే ధనిక దేశం అన్నారు. భారత్‌లో ఉన్నంత సాగు భూమి ఇంకెక్కడా లేదన్నారు.

 

Published at : 05 Feb 2023 04:56 PM (IST) Tags: BJP Dalit Bandhu NANDED BRS KCR Maharastra

సంబంధిత కథనాలు

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Watch Video: దీన్నెవరైనా రోడ్డు అంటారా? మరీ అంత జోక్‌గా ఉందా? - రోడ్ కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్ - వైరల్ వీడియో

Watch Video: దీన్నెవరైనా రోడ్డు అంటారా? మరీ అంత జోక్‌గా ఉందా? - రోడ్ కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఫైర్ - వైరల్ వీడియో

XBB.1.16 Covid Variant: ఢిల్లీలో కరోనా కలవరం, ఆ వేరియంట్‌ వ్యాప్తితో మళ్లీ గుబులు - కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

XBB.1.16 Covid Variant: ఢిల్లీలో కరోనా కలవరం, ఆ వేరియంట్‌ వ్యాప్తితో మళ్లీ గుబులు - కేజ్రీవాల్ అత్యవసర సమావేశం

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

Delhi Liquor Policy Case: సిసోడియాకు షాక్ ఇచ్చిన కోర్టు, బెయిల్ పిటిషన్ తిరస్కరణ

టాప్ స్టోరీస్

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్