Hanuman Chalisa Row: ఇదేందయ్యా ఇది! నీళ్లు కూడా ఇవ్వలేదన్న హీరోయిన్- టీ తాగుతోన్న వీడియో రిలీజ్!
Hanuman Chalisa Row: అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు పోలీస్ స్టేషన్‌లో టీ తాగుతోన్న వీడియోను ముంబయి పోలీస్ కమిషనర్ విడుదల చేశారు.
Hanuman Chalisa Row: పోలీసులు తమను కస్టడీలో హింసించారని, కనీసం తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని అమరావతి ఎంపీ నవనీత్ రాణా చేసిన ఆరోపణలపై ముంబయి పోలీస్ కమిషనర్ సంజయ్ పాండే స్పందించారు. నవనీత్ రాణా, ఆమె భర్త, ఎమ్మెల్యే రవిరాణా ఇద్దరూ ఖర్ పోలీస్ స్టేషన్‌లో టీ తాగుతున్న వీడియోను షేర్ చేశారు. దీనికి ఆయన ‘‘ఇంకేమైనా చెప్పాలా?’’ అని క్యాప్షన్ పెట్టారు.
Do we say anything more pic.twitter.com/GuUxldBKD5
— Sanjay Pandey (@sanjayp_1) April 26, 2022
ఎంపీ ఆరోపణలు
ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారంటూ నమోదైన కేసులో నవనీత్ రాణా, రవిరాణాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన అరెస్ట్ గురించి నవనీత్ రాణా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. తమను అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు హింసించారని, కులం పేరుతో దూషించారని ఆరోపించారు.
మంచి నీళ్లు కావాలని రాత్రంతా అడుగుతూనే ఉన్నా ఇవ్వలేదన్నారు. తాను షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిని కావడంతో గ్లాసులో నీళ్లు ఇచ్చేందుకు నిరాకరించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కమిషనర్, ముంబయి పోలీసులు, సంబంధిత డీసీపీ, ఏసీపీ, ఇతర పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో నవీనీత్ కోరారు.
ఈ లేఖపై స్పందించిన లోక్‌సభ సెక్రటేరియట్ ప్రివిలేజ్, ఎథిక్స్ బ్రాంచ్ దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరింది.
మహారాష్ట్ర సీఎం నివాసం అయిన మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠిస్తానని నవనీత్ కౌర్ సవాల్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్రలో భయానక వాతావరణం పెరిగిందని, అందుకే "మాతో శ్రీ " ఎదుట హనుమాల్ చాలీసా పఠిస్తానని ఆమె అన్నారు.
శివసేనకు సవాల్
నవనీత్ కౌర్ భర్త రవి రాణా కూడా ఎమ్మెల్యేనే. ఆయనతో కలిసి హనుమాన్ చాలీసా పఠించేందుకు వెళ్లక ముందే శివసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున ముంబయిలోని వారింటిముందు ఆందోళనకు దిగారు. శివసేనతో పోరాడుతూండటంతో కేంద్రం ఆమెకు వై కేటగిరి భద్రత కల్పించింది.
రాణా దంపతులకు అధికార శివసేన నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేనను సవాల్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, మహారాష్ట్రలో మీరు ప్రశాంతంగా గడపలేరంటూ శివసేన పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ హెచ్చరించారు.
ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి నవీనీత్ కౌర్ దంపతులను కోర్టులో హాజరు పరచగా వీరిద‍్దరికీ మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలిచ్చింది.
Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు నో రిలీఫ్- బెయిల్ కోసం వెయిటింగ్ తప్పదు
Also Read: Prashant Kishore: కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన పీకే- కానీ ఆ ట్వీట్‌లో మాత్రం ఏదో పంచ్ ఉందేె!