అన్వేషించండి

Prashant Kishore: కాంగ్రెస్‌కు హ్యాండ్ ఇచ్చిన పీకే- కానీ ఆ ట్వీట్‌లో మాత్రం ఏదో పంచ్ ఉందేె!

కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రకటించింది.

కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్లు పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సూర్జేవాలా తెలిపారు. కాంగ్రెస్ ఆఫర్‌ను ప్రశాంత్ కిశోర్ నిరాకరించినట్లు ఆయన తెలిపారు.

" ప్రశాంత్ కిశోర్‌ ఇచ్చిన ప్రజెంటేషన్, సుదీర్ఘంగా సాగిన చర్చల తర్వాత.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. కానీ ఆయన నిరాకరించారు. పార్టీ కోసం ఆయన ఇచ్చిన సలహాలను అభినందిస్తున్నాం.                                               "
-రణ్‌దీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్‌లో చేరాలని పీకేను సోనియా గాంధీ ఆహ్వానించారని అందుకు పీకే నో చెప్పినట్లు సుర్జేవాలా వెల్లడించారు. 

పీకే ట్వీట్

ఈ విషయాన్ని ప్రశాంత్ కిశోర్ కూడా ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. తన కంటే పార్టీకి నాయకత్వం అవసరమన్నారు.

" ఎన్నికల బాధ్యతలు సహా పార్టీలో కీలక పాత్రపై కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చిన ఆఫర్‌ను నేను నిరాకరించాను. నా అభిప్రాయం ప్రకారం, కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న వ్యవస్థాగత సమస్యలు రూపుమాపి, మార్పులు రావాలంటే నా కంటే నాయకత్వం, సమష్టి కృషి అవసరం.                                                       "
-   ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త

కాంగ్రెస్ కోసం

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కుదేలైన పార్టీని బతికించుకునేందుకు కొత్త వ్యూహకర్త కావాలని భావించి ప్రశాంత్‌ కిశోర్‌ను పార్టీలోకి కాంగ్రెస్ ఆహ్వానించింది. ఆయన కూడా వెంటిలేటర్‌ మీద ఉన్న హస్తం పార్టీకి ప్రాణం నింపేందుకు ముందుకు వచ్చారు. అధినాయకత్వంతో నాలుగైదు సార్లు భేటీ అయ్యారు. 

తన వ్యూహాలకు పదునుపెట్టి మిషన్‌ 400 అంటూ పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఇదంతా గమనించిన హస్తం హైకమాండ్‌ పీకేను తమ నేతగా మార్చుకునేందుకు ప్రయత్నించింది.

కొంతకాలంగా జాతీయ స్థాయిలో భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు కోసం ప్రశాంత్‌ కిశోర్‌ ప్రయత్నాలు చేశారు. ఆ తరువాత కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానంటూ ఆ పార్టీ హైకమాండ్‌ను సంప్రదించారు. సోనియాగాంధీ, రాహుల్‌తోనూ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ అనుసరించాల్సిన విధానంపై ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో మాత్రం ఆఫర్‌ను నిరాకరించినట్లు ట్వీట్ చేశారు. 

Also Read: Hanuman Chalisa Row: నవనీత్ రాణా దంపతులకు నో రిలీఫ్- బెయిల్ కోసం వెయిటింగ్ తప్పదు

Also Read: Covid Update: ఫోర్త్ వేవ్ దగ్గర పడిందా! ఒక్కరోజులో 1347 మంది కరోనాతో మృతి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అన్నామలై వ్యూహాలతో బలం పెంచుకుంటున్న బీజేపీనచ్చని పని చేసిన మన్మోహన్, అయినా మోదీ పొగడ్తలుమేం చీమూ, నెత్తురు ఉన్న నాకొడుకులమే! బూతులతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డిManmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Special Trains: తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గుడ్ న్యూస్ - 20 ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఈ రైళ్లు రద్దు, పూర్తి వివరాలివే!
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Gay Murderer: గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
గే కానీ అమ్మాయిలా వేషం వేసి మగాళ్లను పిలుస్తాడు - వెళ్లారో చచ్చినట్లే - ఇప్పటికి 11 మంది !
Manmohan Singh: 'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
'మన్మోహన్ దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తెచ్చారు' - మాజీ ప్రధాని పార్థివ దేహానికి తెలుగు రాష్ట్రాల సీఎంల నివాళి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Embed widget