ముంబయి ప్రజలకు ఊరట- నాలుగు నెలల తర్వాత పెరిగిన గాలి నాణ్యత
ముంబయిలో కురిసిన వర్షాలకు గాలి నాణ్యత పెరిగింది. నాలుగు నెలల తర్వాత ఈ పరిణామంతో నగరవాసులు హ్యాపీగా గాలి పీల్చుకుంటున్నారు.
ముంబయిలోని గాలి నాణ్యత బాగా మెరుగుపడింది. దాదాపు నాలుగు నెలల తర్వాత పాయింట్ల పట్టికలో 92 సూచించింది. SAFAR శాస్త్రవేత్త గుఫ్రాన్ బేగ్ మాట్లాడుతూ... వర్షాలు పడటం, విస్తృతమైన గాలులు కారణంగా కాలుష్యం చాలా వరకు కంట్రోల్ అయింది. తీర ప్రాంతం అంతటా చాలా స్వచ్ఛమైన గాలి ఏర్పడింది. "రేపు గాలి మరింత మెరుగ్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము," అన్నారాయన.నవంబర్ 2022 నుంచి మార్చి మొదటి వారం వరకు గాలి నాణ్యత చాలా దారుణంగా పడిపోయింది. గత ఐదేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది కాలుష్యం. AQIలో చాలా రోజులుగా ఢిల్లీ కంటే దారుణంగా ఉంది.
గాలి నాణ్యత సూచిక అనేది గాలిలో క్యాన్సర్ కారక PM2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5) గాఢతను తెలియజేస్తుంది. శారీరక శ్రమ చేస్తున్నటైంలో ఇది శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ స్థలాలు, డంపింగ్ యార్డ్ నుంచి విపరీతమైన పొగ, దుమ్ము ధూళి రావడంతో కాలుష్యం పెరిగిపోతోంది. దీంతోపాటు లా నినా ప్రభావంతో ముంబయి చుట్టూ ఉండే గాలిని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా కాలుష్య కారకాలు గాలిలో ఉండిపోతాయి. గత నాలుగు నెలలుగా ఇదే జరుగుతోంది.