Mumbai Threats: 'ముంబయిలో ఆరు చోట్ల బాంబులు పెట్టాం' - బెదిరింపు కాల్స్ తో పోలీసుల అలర్ట్
Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైకు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి పలు చోట్ల బాంబులు పెట్టినట్లు చెప్పాడు.
Bomb Threat Messages To Mumbai: దేశ ఆర్థిక రాజధాని ముంబైకు (Mumbai) శుక్రవారం ఉదయం బాంబు బెదిరింపు (Bomb Threats) సందేశాలు రావడం తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఓ గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. నగరవ్యాప్తంగా ఆరు చోట్ల బాంబులు పెట్టినట్లు సదరు వ్యక్తి బెదిరించాడు. దీంతో ముంబయి పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఆయా ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అయితే, ఎలాంటి పేలుడు పదార్థాలు దొరక్కపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు, ట్రాఫిక్ పోలీస్ హెల్ప్ లైన్ కు చెందిన వాట్సప్ నెంబరుకు ఈ కాల్ వచ్చినట్లు గుర్తించి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలోనూ బెదిరింపులు
ముంబయికి గతంలోనూ బాంబు బెదిరింపులు వచ్చాయి. నూతన సంవత్సర వేడుకల వేళ ఓ వ్యక్తి ముంబయి కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి పలు ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు బెదిరించాడు. అంతకు ముందు కూడా పలు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్బీఐ ఆఫీస్ సహా ఇతర బ్యాంకులకు కూడా ఈ తరహా బెదిరింపులు వచ్చాయి. కాగా, అవన్నీ నకిలీవేనని తేలింది.
Also Read: Jharkhand CM: ఝార్ఖండ్ లో వీడిన రాజకీయ అనిశ్చితి - సీఎంగా చంపై సోరెన్, ఆఖరి నిమిషంలో మారిన వ్యూహాలు