News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Mohammad Zubair Bail: జర్నలిస్ట్ జుబైర్‌కు ఊరట- ఆ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చిన సుప్రీం

Mohammad Zubair Bail: జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

FOLLOW US: 
Share:

Mohammad Zubair Bail: ఆల్ట్ న్యూస్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ మహ్మద్ జుబైర్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీం కోర్టు. ఉత్తర్‌ప్రదేశ్‌ సీతాపుర్‌లో ఆయనపై నమోదైన కేసుకు సంబంధించి ఈ బెయిల్ ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం.

5 రోజులే

ఈ కేసుకు సంబంధించి జుబైర్‌కు ఐదు రోజులు మాత్రమే సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే కేసు నమోదైన ఘటనపై మరోసారి ఎలాంటి ట్వీట్లు చేయరాదని ఆదేశించింది. అలానే సీతాపుర్ మెజిస్ట్రేట్ కోర్టు పరిధిని దాటి ఎక్కడికి వెళ్లరాదని హెచ్చరించింది. అలానే సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించకూడదని పేర్కొంది.

అలానే అల్‌హాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జుబైర్ వేసిన పిటిషన్‌పై యూపీ పోలీసులకు నోటీసులు ఇచ్చింది.

ఇదీ కేసు

2018లో జుబైర్ చేసిన ట్వీట్ మత విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉందన్న కేసులో ఆయనను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. ఒక వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్స్ చేశారంటూ జూన్ 27న జుబైర్‌ను అరెస్ట్ చేశారు. సెక్షన్ 153, సెక్షన్ 295ఏ కింద ఆయనపై కేసు నమోదు చేశారు. 

ఇటీవ‌ల నుపుర్ శ‌ర్మ చేసిన వ్యాఖ్యల‌ను కూడా ముందుగా ట్వీట్ చేసింది జుబైర్‌నే. దీంతో ఆయన రెచ్చగొట్టే ట్వీట్స్ చేసిన‌ట్లు దిల్లీ పోలీసులు త‌మ ఎఫ్ఐఆర్‌లో న‌మోదు చేశారు. ప్రజ‌ల్లో ద్వేష‌భావాన్ని పెంచేలా జుబైర్ ట్వీట్లు ఉన్నట్లు  ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

Also Read: Uttarakhand Car Accident: నదిలో కొట్టుకుపోయిన కారు- 9 మంది మృతి!

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 18,815 కరోనా కేసులు- 38 మంది మృతి

Published at : 08 Jul 2022 12:42 PM (IST) Tags: Mohammad Zubair Alt News Mohammad Zubair Bail Supreme Court Grants Interim Bail

ఇవి కూడా చూడండి

బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?

బ్రిటీష్ కాలం నుంచే కెనడాకి సిక్కుల వలసలు, ఆ దేశానికే వెళ్లడానికి కారణాలేంటి?

India-Canada Row: భారత్‌కు మినహాయింపు లేదు-కెనడాతో వివాదంపై బైడెన్‌ అడ్వైజర్‌

India-Canada Row: భారత్‌కు మినహాయింపు లేదు-కెనడాతో వివాదంపై బైడెన్‌ అడ్వైజర్‌

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

Canada Singer Shubh: భారత్‌ నా దేశం కూడా-నేనూ ఇక్కడే జన్మించా : కెనడా సింగర్‌ శుభ్‌

కెనడా రాజకీయాల్ని సిక్కులే శాసిస్తున్నారా? అంత పవర్ వాళ్లకి ఎలా వచ్చింది?

కెనడా రాజకీయాల్ని సిక్కులే శాసిస్తున్నారా? అంత పవర్ వాళ్లకి ఎలా వచ్చింది?

సిక్కుల ఓటు బ్యాంక్‌ కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

సిక్కుల ఓటు బ్యాంక్‌ కోసం కెనడా చిక్కుల్లో పడిందా? భారత్‌తో మైత్రిని కాదనుకుని ఉండగలదా?

టాప్ స్టోరీస్

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Chandrababu Arrest: చంద్రబాబు విజినరీ లీడర్ కాదు ప్రిజీనరీ లీడర్ : మాజీ మంత్రి కన్నబాబు

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Telangana Assembly Elections 2023: చేతులు కలిపిన ప్రత్యర్థులు- ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన రాజయ్య, కడియం

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

Paper Pens: ఏపీలో వెరైటీగా పేపర్‌ పెన్నులు -ఈ పెన్నులు మొలకెత్తుతాయి కూడా

Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు

Varanasi Stadium: మోడీ అడ్డాలో భారీ క్రికెట్ స్టేడియం - శివతత్వం ప్రతిబింబించేలా నిర్మాణం - తరలిరానున్న అతిరథులు