Anant Maheshwari Resigns: మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి రాజీనామా - థ్యాంక్స్ చెప్పిన కంపెనీ
Microsoft India President Resigns: మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి కంపెనీ తన పదవికి రాజీనామా చేశారు. మైక్రోసాఫ్ట్ సంస్థ ఆ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపింది.
Microsoft India president Anant Maheshwari resigns: మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి కంపెనీ నుండి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ పదవికి అనంత్ మహేశ్వరి రాజీనామా చేశారు. అనంత్ రాజీనామా విషయాన్ని మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్ లో తమ సంస్థ అభివృద్ధికి ఆయన అందించిన సేవలకుగానూ ధన్యవాదాలు తెలిపింది. భవిష్యత్తులో ఆయన మరింత మెరుగ్గా రాణించాలని, చేపట్టే పనుల్లో విజయవంతం కావాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ ప్రకటనలో పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ కంపెనీ తన టాప్ ఎగ్జిక్యూటివ్‌ల పొజిషన్లు మార్చుతున్న సమయంలో అనంత్ మహేశ్వరి సంస్థ నుంచి వైదొలుగుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే వేరే చోట కెరీర్ ను చూసుకుని మహేశ్వరి ఈ నిర్ణయం తీసుకున్ని సంస్థ ప్రతినిధి తెలిపారు. భారత్ లో మైక్రోసాఫ్ట్ మెరుగ్గా బిజినెస్ చేయడానికి అవకాశం కల్పించినందుకు అనంత్ మహేశ్వరి సైతం మైక్రోసాఫ్ట్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే గతంలో మైక్రోసాఫ్ట్ ఇండియా డైరెక్టర్ గా సేవలు అందించిన నవ్ తేజ్ బాల్ ను మైక్రోసాఫ్ట్ సీవోవోగా నియమించే అవకాశం ఉందని తెలుస్తోంది.
అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇండియా మాజీ హెడ్ పునీత్ చందోక్ త్వరలోనే మైక్రోసాఫ్ట్ ఇండియాలో చేరబోతున్నారని తెలుస్తోంది. భారత్ తో పాటు దక్షిణాసియా దేశాలకు రిటైల్ బెహెమోత్ అమెజాన్ యొక్క క్లౌడ్ విభాగానికి అధిపతిగా కొనసాగుతున్నారు. ఆగస్టు 31 నుంచి ఏడబ్ల్యూఎస్ రాజీనామా అమలులోకి రానుందని న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ గత నెలలో రిపోర్ట్ చేసింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఇరినా ఘోష్ భారతదేశ విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా చేస్తున్న శశి శ్రీధరన్ కు సంస్థ ప్రమోషన్ ఇచ్చింది. శ్రీధరన్ కు మరింత బెస్ట్ పొజిషన్ ఆఫర్ చేసింది.
అనంత్ మహేశ్వరి బ్యాక్ గ్రౌండ్ ఏమిటీ?
మహేశ్వరి గతంలో హనీవెల్ ఇండియాలో ప్రెసిడెంట్‌గా సేవలు అందించారు. మెకిన్సీ & కంపెనీలో ఎంగేజ్‌మెంట్ మేనేజర్‌గానూ చేశారు. అనంతరం అనంత్ మహేశ్వరి 2016లో మైక్రోసాఫ్ట్‌లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. మహేశ్వరి బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS) పూర్వ విద్యార్థి. ఆయన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ లో పట్టా పొందాడు. BITS పిలానీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని సాధించారు. అహ్మదాబాద్‌లోని ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM)లోనూ కోర్సులు పూర్తిచేశారు.
2023-24కిగానూ మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ గా అనంత్ మహేశ్వరిని నియమిస్తున్నట్లు మే నెలలో నాస్కామ్ ప్రకటించింది. అదే సమయంలో కాగ్నిజెంట్ ఇండియా ఛైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్‌ను వైస్ చైర్‌పర్సన్‌గా నియమించినట్లు నాస్కామ్ పేర్కొంది. అనంత్ మహేశ్వరి అంతకుముందు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బిజినెస్ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రెసిడెంట్ కృష్ణన్ రామానుజం అనంతరం వైస్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial